అమ్మాయిలంటే పిచ్చి.. చేసేది పాన్ షాప్ లో.. ఫేస్బుక్ లో ఆరితేరిపోయాడు.. చాలా ఈజీగా అమ్మాయిలని పడేసి అంతే ఈజీగా కోరికలు తీర్చుకునేవాడు


Loading...

చేసేది పాన్ బిజినెస్. వేసేది వెర్రివేషాలు. అమ్మాయిలంటే పిచ్చి. ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌తో వలవేస్తాడు. పొరపాటున యాక్సెప్ట్‌ చేస్తే లవ్‌ పేరుతో నయా మోసానికి తెరతీస్తాడు. స్వీట్‌పాన్‌లో మత్తు కలిపి అత్యాచారానికి ఒడిగడతాడు. ఆ అశ్లీల దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఇలాగే చేసి ఓ సాఫ్ట్‌ వేర్ అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు. తిరగబడితే ఆమెను బ్రోతల్ కేసులో ఇరికించేందుకు స్కెచ్ వేశాడు. మరి ఈ లవ్ కం క్రైం స్టోరీలో ఆ తర్వాత ఏం జరిగింది?
Loading...

యాష్ బ్యాక్ చూపిస్తూ డ్యాన్స్ చేస్తున్న ఈ అడ్డగాడిదనే ఈ క్రిమినల్ లవ్ స్టోరీ సూత్రధారి, పాత్రధారి. పేరు ఉపేంద్ర వర్మ. హైదరాబాద్‌ సిటీలో పలు చోట్ల మయూర్‌ పాన్‌ హౌజ్‌లు నిర్వహించే మహావీర్ ప్రసాద్ వర్మ కుమారుడు. తన పాన్‌ బిజినెస్‌నే అమ్మాయిలను ట్రాప్‌ చేయడానికి వాడుకున్నాడు ఉపేంద్ర వర్మ అనే నీచుడు. స్వీట్‌ పాన్‌ రుచిచూపిస్తానంటూ అందులో మత్తుమందు కలిపి అమ్మాయిలకు తినిపిస్తాడు. స్పృహ కోల్పోగానే అత్యాచారం చేసి ఆ అశ్లీల దృశ్యాలను కెమెరాలో రికార్డ్ చేస్తాడు. అమ్మాయిలు ఎదురుతిరిగితే ఆ వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేస్తాడు. ఇలా బెదిరిస్తూ తన వాంఛ తీర్చుకోవడం ఈ కామాంధుడు ప్లే చేసే కన్నింగ్ ట్రిక్......
Loading...

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఉపేంద్రవర్మ... అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు. యాక్సెప్ట్ చేయకుంటే మళ్లీమళ్లీ రిక్వెస్ట్ పంపించి ఫోర్స్ చేస్తాడు. యాక్సెప్ట్ చేయగానే ఫ్రెండ్‌ షిప్‌ పేరుతో వలవేస్తాడు. ఒక్కసారి అతడి వలలో చిక్కితే బయటపడడం కష్టం. హైదరాబాద్ కాచిగూడలో నివాసం ఉండే ఓ సాఫ్ట్‌వేర్ యువతికి ఇలాగే ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. మొదట ఫ్రెండ్ షిప్‌ అన్నాడు... ఆ తర్వాత లవ్ అన్నాడు... మరికాస్త ముందుకెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పార్టీలు, పబ్బులంటూ సిటీలోని చాలా ప్రాంతాలకు తిప్పాడు. స్వీట్‌పాన్‌లో మత్తుమందు కలిపి తినిపించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను రికార్డ్ చేసి బెదిరింపులకు దిగాడు.


నాలుగున్నర సంవత్సరాల నుంచి ఆ యువతి జీవితంతో ఆటడుకున్నాడు ఈ నీచుడు. పెళ్లి చేసుకోవాలంటూ ఆమె ఒత్తిడి తేవడంతో తనకు అప్పటికే రాజస్థానీ యువతితో పెళ్లయి ఒక పాప కూడా ఉన్నట్లు అసలు నిజం చల్లగా చెప్పాడు. అయినాసరే ఆమెకు విడాకులు ఇచ్చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ బుకాయించాడు. ఏడాది క్రితం తన ఫ్రెండ్స్ ఓం, ఆకాష్, మనీష్ తదితరుల సమక్షంలో ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. గోవాకు హనీమూన్‌కు తీసుకెళ్లి ఆమెకు క్యారెక్టర్ లేదని ఫ్రెండ్స్‌ ముందు నిరూపించేందుకు కుట్ర పన్నాడు. ఆ తర్వత కూడా బ్రోతల్ కేసులో ఇరికిస్తానంటూ బెదిరించాడు.పెళ్లి చేసుకున్న తర్వాత అసలు వివాహం చేసుకోలేదంటూ ప్లేటు ఫిరాయించాడు. అప్పటి వరకు ఉపేంద్ర వర్మ తన జీవితంతో ఆడుకున్నా యువతి భరించింది. కానీ అసలు పెళ్లే చేసుకోలేదనడంతో తన గోడును కన్నవారి ముందు వెళ్లబోసుకుంది. కూతురు చెప్పింది విని తల్లిదండ్రులు షాకయ్యారు.

ఉపేంద్రవర్మ తనను మోసం చేయడంపై ఫొటోలు, వీడియోలు, మెసేజ్‌లు తదితర సాక్ష్యాధారాలతో కాచిగూడ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. యువతి ఫిర్యాదుతో ఉపేంద్ర వర్మను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఇక అతడికి సహకరించి పరారైన ఫర్నీచర్ వ్యాపారి రాజేష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫ్రెండ్‌ షిప్‌పేరుతో రిక్వెస్ట్‌లు పంపే ఇలాంటి మోసగాళ్లపట్ల జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)