స్వీట్ పాన్ లో డ్రగ్స్ కలిపి సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై


Loading...

హైదరాబాద్ : ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని పాన్ హౌస్ యజమాని పెండ్లి పేరుతో మోసం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగుచూసింది. ఉపేందర్ వర్మ అనే వ్యక్తి మయూర్ పాన్ హౌస్ యజమాని. అతనికి హిమాయత్ నగర్ తో పాటు నగరంలో పలుచోట్ల పాన్ హౌసులున్నాయి.
Loading...

ఉపేందర్ ఫేస్ బుక్ రిక్వెస్టులు పంపిస్తూ, అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు. ఉపేందర్ సదరు సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి స్వీట్ పాన్ లో మత్తు పదార్థాలు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఉపేందర్ తన అశ్లీల వీడియోలు తీసి యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు కాచీగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నిందితుడు ఉపేంద్ర వర్మపై రేప్ కేసు తోపాటు పలు కేసులు నమోదుచేశారు.
Loading...

అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఉపేంద్ర వర్మకు సహకరించిన అతని స్నేహితులు రాజేష్ తో పాటు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని..వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)