లంకె బిందెలు ఉన్నాయి... వాటిని బయటకు తీస్తామంటూ పూజలు చేస్తానని బాలింతపై అత్యాచారం చేసిన పూజారి


Loading...

ఓ ముఠా ఖతర్నాక్ స్కెచ్ వేసింది. పల్లె జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంది. లంకెబిందెలు తీస్తామంటూ ఇళ్లలోకి దూరిపోయారు కంత్రీలు. క్షుద్రపూజల పేరుతో బాలింతపైనే అత్యాచారానికి ఒడిగట్టారు కామాంధులు. ఈ ముఠాలోని ఇద్దరిని పట్టుకున్న జనం చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. మరి మిగతా కేటుగాళ్లు ఏమయ్యారు?
Loading...

లంకె బిందెలు ఉన్నాయి... వాటిని బయటకు తీస్తామంటూ లక్ష్మీనర్సయ్య అనే కంత్రీ ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. మరో నలుగురిని కలుపుకుని అరాచకాలకు తెరతీశాడు. ఇద్దరు కంత్రీలను విద్యుత్ స్తంబానికి కట్టేసి దేహశుద్ధి చేశారు రుద్రాక్షపల్లి వాసులు. తర్వాత తాంత్రిక ముఠాలోని ఆ ఇద్దరిని పోలీసులకు అప్పగించారు.
Loading...

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామాన్ని టార్గెట్ చేసింది ఈ ముఠా. దీనికి సూత్రధారి లక్ష్మీనర్సయ్య. ఇతడి స్వస్థలం కల్లూరు మండలం యజ్ఞనారాయణపురం. ఓ ఇంట్లో లంకెబిందెలు ఉన్నాయంటూ ఈ కంత్రీ ముఠా రుద్రాక్షపల్లిలో రెండు నెలల క్రితం వాలిపోయింది. క్షుద్రపూజలు చేస్తామంటూ అప్పటి నుంచి ఆ ఇంటి చుట్టూనే తిరుగుతున్నారు. అమాయకుడైన ఇంటి యజమానిని నమ్మించి తాంత్రిక పూజలు మొదలు పెట్టారు. ఓ వ్యాన్‌లో రోజూ ముగ్గురి నుంచి ఐదుగురి వరకు వచ్చి పూజలు చేసి వెళ్తున్నారు. ఇదంతా స్థానికులు గమనిస్తూనే ఉన్నారు.

ఒక రోజు లక్ష్మీనర్సయ్య, మరో వ్యక్తి పూజల పేరుతో ఆ ఇంట్లోకి దూరిపోయారు. క్షుద్రపూజలు చేస్తామంటూ ఇంటి యజమానిని బయటకు పంపించారు. ఇంట్లో ఉన్న బాలింతపై అత్యాచారానికి ఒడిగట్టారు ఈ నీచులు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కలవారు మంత్రగాళ్లను బంధించి విద్యుత్తు స్థంబానికి కట్టేసి చితకబాదారు.

నిందితులను చితకబాదిన తర్వాత వారిని సత్తుపల్లి పోలీసులకు అప్పగించారు. లంకెబిందెల పేరుతో అమాయకులను ఈ ముఠా మోసం చేయడంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠాలోని మిగతా ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. లంకెబిందెలు తీస్తామంటూ క్షుద్రపూజలు చేసి అత్యాచారాలకు పాల్పడే ఇలాంటి ముఠాల మాయలో పడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)