హెల్మెట్ వాడటం వలన జుట్టు రాలిపోతుందా బట్టతల వచ్చే సమస్య ఉందా


Loading...

వాహనం నడిపే సమయంలో నేను ఎప్పుడూ హెల్మెట్‌ వాడుతుంటాను. అయితే ఇటీవలే నా తలవెంట్రుకలు రాలిపోవడం గమనించాను. కాస్త బట్టతలలా ఉంది. ఇలా నా వెంట్రుకలు రాలడానికి హెల్మెటే కారణమా అంటూ ఓ యువకుడు వాపోతున్నాడు.
Loading...

అయితే అతను అలా బాధపడటంలో అస్సలు అర్ధంలేదు. హెల్మెట్‌ వాడటానికీ జట్టు రాలిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు. పైగా హెల్మెట్‌ వల్ల తలకు, జుట్టుకు రక్షణ కలుగుతుంది. జట్టు రాలిపోతుందంటే బహుశా జన్యువుల ప్రభావమే కారణం కావచ్చు. ఇటీవల పురుషుల్లో వచ్చే బట్టతలకు బయోటిన్‌ ఫెనస్టెరైడ్, మినాక్సిడిల్, ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా థెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
Loading...

అయితే పూర్తి మెడికల్‌ హిస్టరీని అధ్యయనం చేసి, బట్టతలకు ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఆ తర్వాతనే పైన పేర్కొన్న మందులను తప్పనిసరిగా డాక్టర్‌ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)