బాటిల్లో మత్తు మందు, శృంగార కోరికలని పెంచే టాబ్లెట్స్ వేసి ఇచ్చాడు


Loading...

పరిచయం పెంచుకుంటే కొందరు మగాళ్లు ఏకంగా అనుభవించేందుకు తారాడే కామాంధులుగా మారిపోతున్న సంఘటనలు ఇప్పుడు అక్కడక్కడా వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి ఘటనే సింగపూర్‌లో జరిగింది. తను వుంటున్న పక్క ప్లాటులో 21 ఏళ్ల యువతిపై కన్నేశాడు 28 ఏళ్ల భారతీయుడు. అంతే... ఆమె మామూలుగా అయితే వల్లకాదని వేరే ప్లాన్ వేశాడు. కానీ అది కాస్తా బెడిసి కొట్టడంతో జైలు పాలవడంతో పాటు కొరడా దెబ్బలు కూడా తిన్నాడు. పరిచయం పెంచుకుంటే కొందరు మగాళ్లు ఏకంగా అనుభవించేందుకు తారాడే కామాంధులుగా మారిపోతున్న సంఘటనలు ఇప్పుడు అక్కడక్కడా వెలుగుచూస్తున్నాయి. ఇలాంటి ఘటనే సింగపూర్‌లో జరిగింది. తను వుంటున్న పక్క ప్లాటులో 21 ఏళ్ల యువతిపై కన్నేశాడు 28 ఏళ్ల భారతీయుడు.
Loading...

అంతే... ఆమె మామూలుగా అయితే వల్లకాదని వేరే ప్లాన్ వేశాడు. కానీ అది కాస్తా బెడిసి కొట్టడంతో జైలు పాలవడంతో పాటు కొరడా దెబ్బలు కూడా తిన్నాడు. వివరాలు చూస్తే... అన్నాదురై ప్రభాకరన్ సింగపూర్‌లో బస్సు డ్రైవరుగా వుంటున్నాడు. ఐతే తను వుంటున్న పక్క ఇంట్లో 21 ఏళ్ల యువతిని చూసి ఆమెతో ఎలాగైనా లైంగిక సుఖం తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు తను అనుకున్న విధంగా మార్గాన్ని అమలుచేశాడు. మంచినీళ్లలో నిద్రమాత్రలు కలిపి ఆమెకు ఇవ్వడం ద్వారా ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేయాలని భావించాడు. ఐతే ఆమెకు నిద్ర మాత్రలు వేస్తే మత్తు వస్తుందో లేదే టెస్ట్ చేసేందుకు ముందుగా రెండు మాత్రలు వేసి ఆమెకు ఇచ్చాడు. ఆమె బాటిల్లోని నీటిని తాగి ఏదో తేడాగా వున్నదని గమనించింది. నీళ్లెందుకు అలా వున్నాయని అడిగితే అతడు నీళ్లు నమలడం ప్రారంభించాడు.
Loading...

దానితో తన బంధువులను పిలిచి ఆ నీళ్లను చూపించింది. వాటిని పరీక్షించడంతో అందులో మత్తు మందు, శృంగార కోరికలని పెంచే కొన్ని మందులు వున్నట్లు తేలింది. దీనితో అతడిని అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. విచారణ చేసిన కోర్టు అతడికి రెండున్నరేళ్ల జైలుతోపాటు మూడు కొరడా దెబ్బలు వేయాలని కోర్టు తీర్పు చెప్పింది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)