నా రేట్ ఇంతేనా అంటూ హాట్ బ్యూటీ ఫైర్


Loading...

అల్లు అర్జున్‌తో అస్మైక యోగ తస్మైక భోగ.. అంటూ స్క్రీన్‌పై రొమాన్స్ పండించిన హాట్ బ్యూటీ పూజా హెగ్డేకి వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం మాటల మాంత్రికుడి చేతిలో ఈ అందాల బొమ్మ మరింత అందంగా ముస్తాబవుతోంది. అరవింద సమేతలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి స్టెప్పేయనుంది. తాజాగా పూజ ఓ వివాదాస్పద అంశానికి తెరతీసింది. ఓ సినిమా హిట్ ఫట్‌లతో పని లేకుండా హీరోయిన్ పాత్ర ఉంటుంది. ఒక్కో సినిమాలో ఆమెనే ప్రధాన పాత్రధారిణిగా చూపుతారు.
Loading...

మరో సినిమాలో ఐటెం సాంగ్ లేదా మరొకటి పెట్టి పబ్లిసిటీ చేసుకుని క్యాష్ చేసుకుంటారు. అంటే సినిమాలో పాత్ర పరంగా సమాన భాగస్వామ్యం ఉంటుంది. అయినా మాకు రెమ్యునరేషన్ విషయంలో హీరోలతో సమానంగా ఇవ్వరు. వారికి మాత్రం స్పెషల్ ఏంటి అని ప్రశ్నిస్తూ, ఈ మద్య వచ్చిన మహానటి, బాలీవుడ్‌లో రాజీ, ఇంకా మొన్నే రిలీజైన వీర్ ది వెడ్డింగ్ చిత్రాలు మహిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాలు. కలెక్షన్ల పరంగా దూసుకు వెళుతున్నాయి. వీటిని బట్టి హీరోయిజం ఉన్న చిత్రాలే కాదు.. హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు కూడా ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి రప్పించగలవనేది పూజ స్టేట్‌మెంట్. నెటిజన్స్ కూడా పూజకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె వాదన సమంజసమే అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)