స‌ర‌దాగా బీచ్‌కు వెళ్లారు..ఏడుమంది ఉన్న కుటుంబంలో మిగిలింది ఒక్క‌రే


Loading...

వారాంత‌పు స‌ర‌దా ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఆదివారం సెల‌వురోజు కావ‌డంతో స‌ముద్ర‌పు ఒడ్డుకు వెళ్లిన ఆ కుటుంబంలో ఆరుమంది ఇక వెన‌క్కి తిరిగి రాలేదు. స‌ముద్ర‌పు అల‌ల్లో కొట్టుకుపోయారు. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న మ‌హారాష్ట్రలోని ర‌త్న‌గిరి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుల్లో ముగ్గురు మ‌హిళ‌లు ఉన్నారు. మృతుల‌ను రెంచ‌ర్ డిసౌజా, మాథ్యూ డిసౌజా, కెనెత్ డిసౌజా, మోనికా డిసౌజా, రీటా డిసౌజా, స‌నోమి డిసౌజాగా గుర్తించారు. వారిలో మోనికా డిసౌజా మిన‌హా మిగిలిన వారంద‌రూ పాతికేళ్ల‌లోపు వ‌య‌స్సున్న వారే. ముంబైలోని బోరివ‌లిలో నివ‌సించే వారు. మొత్తం ఏడుమంది కుటుంబ స‌భ్యులు ఉన్న ఆ కుటుంబం కారులో ర‌త్న‌గిరి జిల్లాలోని ఆరే బీచ్‌కు బ‌య‌లుదేరింది.
Loading...

మ‌ధ్యాహ్నం 4 గంట‌ల స‌మ‌యంలో వారు బీచ్‌కు చేరుకున్నారు. కుటుంబ పెద్ద తిమోతి మాస్ట‌ర్స్ డిసౌజా మిన‌హా మిగిలిన వారంద‌రూ స‌ర‌దాగా స‌ముద్రంలో దిగారు. స‌ముద్రంలో దిగొద్దంటూ మ‌త్స్య‌కారులు, తీర ప్రాంత ర‌క్ష‌ణ సిబ్బంది చెబుతున్న‌ప్ప‌టికీ.. వారు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. సాయంత్రం 5 గంట‌ల స‌మ‌యంలో ఒక్క‌సారిగా ఉవ్వెత్తున అల‌లు ఎగిసిప‌డ్డాయి. స‌ముద్రం పోటెత్తింది. దీనితో వారంద‌రూ స‌ముద్రంలో కొట్టుకుపోయారు. ఆరే బీచ్ వ‌ద్ద స‌ముద్ర‌పు పాయ కొంత చొచ్చుకుని వ‌చ్చిన‌ట్టు ఉంటుంది. ఈదురు గాలుల‌కు అల‌లు ఉవ్వెత్తున ఎగిసిప‌డి, వారిని స‌ముద్రంలోనికి లాక్కుని వెళ్లిన‌ట్లు ప్ర‌త్య‌క్ష సాక్షులు చెబుతున్నారు. సుమారు గంట త‌రువాత వారి మృత‌దేహాలు ఒక్క‌టొక్క‌టిగా అలల‌తో పాటు ఒడ్డుకు కొట్టుకుని వ‌చ్చాయి. మృత‌దేహాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)