న‌ది స్నానానికి వెళ్లొస్తున్న యువ‌తిపై అన్న‌ద‌మ్ముల గ్యాంగ్‌రేప్‌


Loading...

న‌దిలో స్నానం చేసి వ‌స్తోన్న ఓ యువ‌తిపై ముగ్గురు అన్న‌దమ్ములు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఆ ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఉదంతం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. జిల్లాలోని రాంభా పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న బ‌డ‌చ‌క‌డ గ్రామానికి చెందిన బాధితురాలు కింద‌టి నెల 26వ తేదీన త‌న న‌లుగురు స్నేహితుల‌తో క‌లిసి న‌దీ స్నానానికి వెళ్లింది. ముగ్గురు న‌ది వ‌ద్దే ఉండిపోగా.. బాధితురాలు ఒంటరిగా ఇంటికి వెళ్ల‌సాగారు.
Loading...

దీన్ని గ‌మ‌నించిన అదే గ్రామానికి చెందిన ముగ్గురు అన్న‌ద‌మ్ములు ఆమెను అడ్డ‌గించారు. పొదల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. వారిని శ‌శాంక్ స్వైన్‌, స‌హ‌దేబ్ స్వైన్‌, సుబ్ర‌త్ స్వైన్‌గా గుర్తించారు. ఈ విష‌యాన్ని బాధితురాలు మొద‌ట్లో ఎవ‌రికీ చెప్పుకోలేక‌పోయారు. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు రావ‌డాన్ని గ‌మ‌నించిన త‌ల్లిదండ్రులు ప్ర‌శ్నించ‌గా.. అస‌లు విష‌యం వెల్ల‌డైంది.
Loading...

దీనితో త‌ల్లిదండ్రులు, బాధితురాలు రాంభా పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. అప్ప‌టికే ఆ ముగ్గురు అన్న‌ద‌మ్ములు గ్రామం వ‌దిలి వెళ్లిపోయారు. ఉపాధి కోసం గుజ‌రాత్‌కు వెళ్లిన‌ట్లు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. దీనితో వారిని అరెస్టు చేయ‌డానికి ఓ ప్ర‌త్యేక బృందాన్ని పోలీసులు గుజ‌రాత్‌కు పంపించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)