అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం పోలీసు వేట.. మొత్తానికింత కలకలం రేగుతున్నా అల్లు అర్జున్ నుంచి ఇప్పటికి ఒక్కమాట కూడా వెలువడలేదు


Loading...

అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్టు… మరి కొందరి కోసం పోలీసుల వేట…. ఇదీ వార్త..! నమ్మశక్యంగా లేదా..? అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాస్త పద్ధతిగానే ఉంటారు కదా… మరేమిటీ సమస్య అనుకుంటున్నారా..? అల్లు అర్జున్ తెలుగు ఫ్యాన్స్ విషయం కాదు ఇక్కడ, మళయాళం ఫ్యాన్స్ సంగతి..! ఇక్కడ మనవాళ్లు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌ను ఆడిపోసుకుంటారు గానీ, కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అరాచకం… ఇక్కడ శ్రీరెడ్డి పవన్ కల్యాణ్‌ను ఏదో తిట్టిందని మెగా ఫ్యాన్స్ అందరూ ఫైర్ అయిపోతున్నారు కదా… కేరళలో దీనికి పూర్తి కంట్రాస్టుగా అక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓ ఫిలిమ్ లేడీ క్రిటిక్‌ను దానికి వంద రెట్లు తిట్టేస్తున్నారు… తిట్టడం కాదు, రేప్ చేస్తారట, చంపేస్తారట… విషయం వివరంగా చెప్పుకోవాలంటే..?

Loading...

ఈమె పేరు అపర్ణ ప్రశాంతి… ఫ్రీలాన్సర్… సోషల్ మీడియాలో ఫిలిమ్ రివ్యూయర్… అంతేకాదు.., అఝిముగం, మనోరమ, మాతృభూమి తదితర సంస్థలకూ రివ్యూలు రాస్తుంటుంది… ఉన్నదున్నట్టు రాస్తుంది… సహజంగానే ఫ్యాన్స్‌కు కోపం రగులుతుంది కదా… వాళ్ల హీరో సినిమాను ఎవరూ అనొద్దు… అది అట్టర్ ఫ్లాప్ అయినా సరే, అద్భుతం అని రాసేయాలి… ఈమె ఆమధ్య సోషల్ మీడియాలో నాపేరు సూర్య సినిమాపై ఓ పోస్టు పెట్టింది… ‘‘సినిమా చూస్తుంటే తల్నొప్పి స్టార్టయింది… బయటికి వెళ్లిపోదామంటే బయట భారీ వర్షం… ఏం చేయను..?’’ అదీ ఆ పోస్టు… నిజానికి సినిమా చాలామందిని నిరాశపరిచింది కూడా..! ఇక ఆ పోస్టు చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ రగిలిపోయారు… ఇక మొదలు పెట్టారు… ట్రోలింగే కాదు, మెసేజులు, బెదిరింపులు, తిట్లు… ఆమెనే కాదు, వాళ్లమ్మను కూడా కలిపేసి నానా బూతులకు దిగారు…
‘‘నీ అంత్యక్రియల దగ్గర కలుద్దాంలే డియర్ అని ఒకరు… రేప్ చేసి వదిలేస్తే ఏం చేస్తావే ముం- అని మరొకడు…’’ ఇలా ట్రోలింగ్ మొదలైంది… అల్లు అర్జున్‌ ఫోటోలతో క్రియేట్ చేయబడిన అనేకానేక ఫేక్ ఖాతాల ద్వారా ఈ బెదిరింపులు సాగాయి, సాగుతున్నాయట… ‘‘కసబ, ముంతిరి వల్లికల్, తలిర్క్ కుంభల్ వంటి మమ్ముట్టి, మోహన్‌లాల్ సినిమాలపైనా రివ్యూలు రాశాను… కానీ ఈ స్థాయి నీచమైన బెదిరింపులు ఇదే ఫస్ట్’’ అంటున్నది ఆమె… ఇక కొందరైతే ఆమెను అలా ఇలా బెదిరించకుండా… ఓ సైనికుడిగా మా బన్నీ కనిపిస్తే తిడతావుటే, నువ్వు జాతి ద్రోహివి, నువ్వు పాకిస్థానీ తొత్తువు అని కూడా తిట్టేశారట… ఆమె బెదిరిపోకుండా, ఇక తనను చంపేసినా సరే, దీన్ని ఎదుర్కోవాలనే నిర్ణయించుకుంది… పోలీసులకు కంప్లయింట్ చేసింది…

Loading...

ఇటీవల ఇలాంటి ట్రోలింగ్ మరీ శృతి మించినా పోలీసులు ఈ కేసును కూడా పెద్దగా పట్టించుకోలేదు మొదట్లో… ఆమె ఫిర్యాదు తరువాత రెండు వారాల తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు… అదీ పత్రికల్లో అనేక విమర్శలు పబ్లిష్ అయ్యాక… సోషల్ మీడియాలో విమర్శలు పెరిగాక…! కానీ కేసు మాత్రం బలంగా పెట్టారు… అల్లాటప్పాగా పెట్టలేదు… అల్లు అర్జున్ ఫోటోతో ఓ ఫేక్ ఐడీ క్రియేట్ చేసి, ఆమెను బెదిరించిన వాళ్లలో నియాసుద్దిన్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు… తను ఈమె నివాసానికి దగ్గర్లోనే ఉంటాడట… తనను రిమాండ్‌కు పంపించారు… ఈ కేసులో ఇంకొన్ని అరెస్టులు జరుగుతాయని, సెర్చ్ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు… నిందితుడిపై ఐటీ యాక్టే కాదు, చాలా సెక్షన్లు పెట్టేశారు… కిడ్నాప్ లేదా హత్యాబెదిరింపులు, మహిళలకు వేధింపులకు వర్తించే ఐపీసీ 364, 354, 294, 506 సహా ఐటీ యాక్ట్‌లోని కొన్ని సెక్షన్లూ పెట్టారు… కేరళలో ఇప్పుడు పోలీసులు చెబుతున్నది ఏమిటంటే..? ఆన్‌లైన్‌లో ఎవరికి ఇలాంటి వేధింపులు వచ్చినా సరే… స్క్రీన్ షాట్లు తీసి మా హైటెక్ సెల్‌కు ఫిర్యాదు చేయండి, సీరియస్ సెక్షన్లు పెట్టేసి, జైలుకు పంపించేద్దాం… ఈమె మొత్తం 18 మందిపై కేసు పెట్టింది… అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెల్‌ఫేర్ అసోసియేషన్ ఆమెకు సంతాపం తెలిపింది… ఐనా సరే తన పట్ల దూషణలు ఆగలేదని అంటున్నది ఆమె… మొత్తానికింత కలకలం రేగుతున్నా… అల్లు అర్జున్ నుంచి ఇప్పటికి ఒక్కమాట కూడా వెలువడలేదు…!!
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)