నాగార్జున వర్మ ఇద్దరూ ఎంత నీచానికి దిగజారారో.. ఆఫీస‌ర్ ఉచ్చులో పడి దారుణంగా మోసం


Loading...

రాంగోపాల్ వ‌ర్మ – నాగార్జున ఆఫీస‌ర్ డిజాస్ట‌ర్ల‌కే బిగ్ డిజాస్ట‌ర్‌. ఈ విష‌యంలో ఎవ్వ‌రికి ఎలాంటి సందేహం లేదు. కొన్ని చోట్ల ఘోరంగా ఫ‌స్ట్ షోల‌కే సినిమా లేపేశారు. చాలా చోట్ల థియేట‌ర్ల రెంట్లు కూడా రాని ప‌రిస్థితి. వ‌ర్మ‌కు ఇది పెద్ద అవ‌మానం కాక‌పోయినా నాగ్‌కు నిజంగానే ఘోర‌మైన అవ‌మానం. ఇదిలా ఉంటే ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు ఇప్పుడు ల‌బోదిబో మంటున్నారు. తాము నాగ్‌ను న‌మ్మి దారుణంగా దెబ్బ‌తిన్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.
Loading...

తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన ఓ చిన్న బ‌య్య‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం ఆఫీస‌ర్ రైట్స్ ఏకంగా ఆంధ్రా మొత్తానికి కొనేశాడు. ఇది పెద్ద షాకే. నిన్న ఆయ‌న ఆఫీస‌ర్‌తో ఘోరంగా దెబ్బ తిన్నాన‌ని త‌న‌కు ఆత్మ‌హ‌త్యే శ‌ర‌ణ్య‌మ‌ని వాపోయిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న టోట‌ల్‌గా ఆంధ్రా ఏరియాకు ఆఫీస‌ర్ రైట్స్ ఎలా కొన్నాడా ? అని ఆరా తీస్తే దీని వెన‌క పెద్ద త‌తంగ‌మే న‌డిచింద‌ట‌. ఆఫీస‌ర్ ఉచ్చులో సుబ్ర‌హ‌ణ్యం ప‌డ్డాడు.
Loading...

సుబ్ర‌హ్మ‌ణ్యం చిన్న ఫైనాన్ష‌ర్‌. ఆఫీస‌ర్ నిర్మాత‌లు ఆయ‌న్ను సినిమా కోసం ఫైనాన్స్ అడిగారు. దీంతో ఆయ‌న 1.50 ల‌క్ష‌ల‌కు కాస్త అటూ ఇటూగా ఫైనాన్ష్ చేశారు. సినిమా కంప్లీట్ అవుతున్న టైంలో త‌న అమౌంట్ వెన‌క్కి అడిగితే వ‌ర్మ అండ్ నాగార్జున  గ్యాంగ్ త‌ప్పించుకుని తిరగ‌డం స్టార్ట్ చేశార‌ట‌. కాగితాలు ఉన్నాయ‌ని ఆయ‌న గ‌ట్టిగా అడిగే స‌రికి కోర్టుకు వెళ్లు అయితే అని చెప్పార‌ట‌.

కోర్ట‌కు వెళితే ఏళ్ల‌కు ఏళ్లు గడిచిపోతాయ్‌. దీంతో సుబ్ర‌హ్మ‌ణ్యం తాను ఇచ్చిన అమౌంట్‌కు క‌నీసం ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల రైట్స్ ఇవ్వ‌మ‌ని అడిగార‌ట‌. అంతే ఆయ‌న్ను ట్రాప్ చేసేశారు. ఈ సినిమా రైట్స్ ఎవ్వ‌రూ కొన‌డం లేదు. వెంట‌నే వీళ్లు గోదావ‌రి జిల్లాల రైట్స్ ఎందుకు… టోట‌ల్‌గా ఏపీ రైట్సే ఇచ్చేస్తాం… చాలా త‌క్కువ రేటుకు అని న‌మ్మించారు. ఓ 3.5 కోట్లు ఇస్తే చాల‌ని చెప్పారు.

పెట్టిన పెట్టుబ‌డి వ‌స్తుంద‌న్న ధీమాతో సుబ్ర‌హ్మ‌ణ్యం తెగించి 19 ల‌క్ష‌లు త‌గ్గించి టోట‌ల్‌గా ఆఫీస‌ర్ ఆంధ్రా రైట్స్‌ను 3.19 ల‌క్ష‌ల‌కు కొనేశాడు. ఇప్పుడు క‌ట్ చేస్తే థియేట‌ర్ల రెంట్లు ఎదురు క‌ట్టుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. ఇలా వ‌ర్మ అండ్ గ్యాంగ్ సుబ్ర‌హ్మ‌ణ్యాన్ని నిలువునా ముంచేసింద‌న్న టాక్ ట్రేడ్ వ‌ర్గాల్లో స్ప్రెడ్ అవుతోంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)