కాటికి కాలు సాచే వయస్సులో రెండో పెళ్లి చేసుకున్నాడు... రెండేళ్లు కాపురంతో మోజు తీర్చుకున్నాడు 63 ఏళ్ల భర్తకోసం 37ఏళ్ల భార్య


Loading...

కాటికి కాలు సాచే వయస్సులో రెండో పెళ్లి చేసుకున్నాడు... రెండేళ్లు కాపురంతో మోజు తీర్చుకున్నాడు... ఆ తర్వాత ఆమెను వదిలించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టాడు... దీంతో భర్త ఇంటి ముందే మౌన పోరాటానికి దిగింది ఆ ఇల్లాలు. హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ పరిధిలోని చిన్నగోల్కొండ గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన...
Loading...

కరీంనగర్‌ జిల్లా దాసారం గ్రామానికి చెందిన 63ఏళ్ల జయకిషన్‌ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌... మొదటి భార్యకు విడాకులిచ్చిన జయకిషన్‌ చిన్న గోల్కొండలో విలాసవంతమైన ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాడు. ఒంటరితనాన్ని భరించలేక మహిళ తోడు కోరుకున్నాడు... అనుకున్నదే తడవుగా రెండేళ్ల క్రితం గుంటూరు బొబ్బర్లంకకు చెందిన 37ఏళ్ల లక్ష్మీ చైతన్యను వివాహమాడాడు. అయితే అప్పటికే లక్ష్మికి పెళ్లై ఇద్దరు ఆడ పిల్లలున్నారు... భర్త చనిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వివాహానికి ఒప్పుకుంది... శంషాబాద్‌లోని అమ్మపల్లి ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరికీ పెళ్లయ్యింది.
Loading...

రెండేళ్లు లక్ష్మీ చైతన్యతో కాపురం చేసిన జయకిషన్‌ మోజు తీరిపోగానే నువ్వు అక్కర్లేదంటూ ముఖం చాటేశాడు. భర్త నిర్వాకాన్ని నిరసిస్తూ లక్ష్మీ చైతన్యం రెండ్రోజులుగా ఇంటిముందే బైఠాయించి మౌన పోరాటం చేస్తోంది. తనకు న్యాయం కావాలని కోరుకుంటోంది. ఇద్దరు ఆడపిల్లలున్నారని తెలిసే వివాహం చేసుకున్నాడని, ఇప్పుడు పిల్లలకు తనకు సంబంధం లేదంటున్నాడని లక్ష్మి ఆరోపించింది.

భర్త నిర్వాకాన్ని నిరసిస్తూ లక్ష్మీ చైతన్య ఆందోళనకు దిగడంతో జయకిషన్ తన అనుయాయులతో ఫోన్‌ ద్వారా బెదిరింపులకు దిగాడు. ఇంటి తలుపును టచ్‌ చేసినా థెఫ్ట్‌ కేసు పెడతానంటూ హెచ్చరించాడు. ఈ సంభాషణను లక్ష్మి రికార్డు చేసి మీడియా ముందు పెట్టింది... తనతోపాటు తన ఇద్దరు కూతుళ్లకు న్యాయం జరిగేవరకు ఎలాంటి పోరాటానికైనా వెనకాడే ప్రసక్తి లేదని బాధితురాలు చెబుతోంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)