వ్య‌భిచారం కేసులో `వాణి-రాణి` సీరియ‌ల్స్‌ న‌టి రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్టు! జూనియ‌ర్ ఆర్టిస్టులు కూడా!


Loading...

ఓ ప్రైవేట్ ఛాన‌ల్‌లో ప్ర‌సారం అయ్యే అర‌వం డ‌బ్బింగ్ సీరియ‌ల్ `వాణి-రాణి`కి మన తెలుగు లోగిళ్ల‌లో మంచి ఆద‌ర‌ణ ఉంది. ఆ సీరియ‌ల్ వ‌చ్చే స‌మ‌యానికి ఇంట్లో ఆడ‌వాళ్లంతా టీవీ ముందు కూర్చుంటారు. సీరియ‌ల్ చూస్తూ గ‌డిపేస్తుంటారు. అర‌వం నుంచి డ‌బ్బింగ్ అయిన‌ప్ప‌టికీ.. మ‌నోళ్ల‌కు న‌చ్చిందంటే.. ఇక దానికి తిరుగు ఉండ‌దు. దాదాపు ఆ సీరియ‌ల్‌లో న‌టించిన వారందర్నీ ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు కూడా. ఆ సీరియ‌ల్‌తో తెలుగు టీవీ వీక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌య‌మైన న‌టి సంగీత బాల‌న్. ఇప్పుడామె వ్య‌భిచారం కేసులో అరెస్ట‌య్యారు.
Loading...

ఆమెపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ట్విస్ట్ ఏమిటంటే- ఈ వ్య‌భిచార గృహాన్ని న‌డుపుతున్న‌దే ఆమె. చెన్నై శివార్ల‌లోని ప‌య‌నూర్ రిసార్ట్‌లో ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు పోలీసులు. ఆమెతో పాటు ప‌లువురు జూనియ‌ర్ ఆర్టిస్టులు, స‌తీష్ అనే మ‌రో వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. ప‌య‌నూర్‌లోని ఈసీఆర్ విల్లాలో పెద్ద ఎత్తున వ్య‌భిచార కార్య‌క‌లాపాలు న‌డుస్తున్న‌ట్టు స‌మాచారం అంద‌డంతో పోలీసులు దాడి చేశారు. ఈ దాడి సంద‌ర్భంగా సంగీతా బాల‌న్ అదే రిసార్ట్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. ఉత్త‌రాదికి చెందిన ప‌లువురు చిన్నా, చిత‌క టీవీ న‌టులను అదుపులోకి తీసుకున్నారు.
Loading...

ఈ సెక్స్ రాకెట్ వెనుక మాస్ట‌ర్‌మైండ్ సంగీతా బాల‌నే అని తేలడంతో పోలీసులు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు. వాణి-రాణితో పాటు చెల్ల‌మే, స‌బితా ఆలియాస్ స‌భాప‌తి, అవ‌ల్‌, అన్నైకోడియుమ్ అవింధు పెంగ‌ల‌మ్‌, పిళ్లై నీలా, వ‌ల్లి వంటి సీరియ‌ళ్ల‌లో ఆమె న‌టించారు.

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)