పరువు, మర్యాద అంటూ పెళ్లైన మూడు రోజులకే ఓ ఆడబిడ్డ జీవితాన్ని


Loading...

అందరూ మనుషులే.. అందరిలో ప్రవహించేది ఎర్రని రక్తమే. సమాజం ఎంతగా అభివృద్ధి చెందినా మనిషే పెట్టుకున్న కులాలు, మతాలు ఇంకా సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ కులం, మతం చూసి పుట్టదు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రేమ వివాహమే చేసుకున్నారు. కానీ కూతురు ప్రేమించిన వాడిని కట్టుకుంటానంటే ఇష్టపడలేకపోయారు. వారిని కాదని ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు అతడిని నిలువునా హత్య చేశారు. కన్నబిడ్డ కన్నీళ్లకు కారణమయ్యారు.
Loading...

కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన జోసెఫ్ క్రిస్టియన్ కులానికి చెందిన వాడు. అతడు నీనూ అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడు. మూడు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఓ రోజు పెళ్లి చేసుకుంటామని ఇరు కుటుంబాలకు తెలియజేసారు. జోసఫ్ కుటుంబం అభ్యంతరం ఏమీ చెప్పక పోవడంతో అటు నుంచి లైన్ క్లియర్ అయ్యిందనుకున్నారు. కానీ నీనూ కుటుంబంలోని వారికి ఈ పెళ్లి ఇష్టంలేదు. నీనూ తల్లి ముస్లిం, తండ్రి క్రిస్టియన్. అయినా కూతురి ప్రేమ వివాహం చేసుకుంటానంటే అంగీకరించలేకపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేజర్లమైన మేము వివాహం చేసుకుంటామని కరాఖండిగా చెప్పారు ప్రేమ జంట. పెద్దలకు ఇష్టం లేకుండానే మే 24న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. జోసఫ్‌ను బావగా ఇష్టపడని నీనూ సోదరుడు ఎలాగైనా అతడిని అంతమొందించాలనుకున్నాడు. దానికోసం పథకం వేసాడు.
Loading...

మే 27 తెల్లవారుజామున 2 గంటలకు నీనూ సోదరుడు 13 మందితో కలిసి వెళ్లి జోసఫ్‌ను కిడ్నాప్ చేశారు. జోసెఫ్ తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించినా పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు. విచారణలో అలసత్వం వహించారు. ఈలోపు కిడ్నాప్ చేసిన జోసెఫ్‌‌ని నీనూ సోదర బృందం హత్య చేసి చాలియక్కర నదిలో పడేశారు. పెళ్లైన మూడు రోజులకే ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త కళ్లముందు నిర్జీవంగా పడి ఉండడాన్ని తట్టుకోలేక నీనూ కన్నీరు మున్నీరవుతోంది. పెద్దల పగ ప్రతీకారాలు, పోలీసుల అలసత్వం కారణంగా ఓ ఆడబిడ్డ కన్నీటికి కారణమయ్యారని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు వెంటనే ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఎస్‌ఐ,ఏఎస్‌ఐలను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)