భార్య చెల్లిపై కన్నేశాడు.. ఈ విషయం భార్యకు కూడా చెప్పాడు.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో..


Loading...

భార్య ముగ్గురు పిల్లలు ఉన్నా, మరదలి(మైనర్‌)ని బలవంతంగా పెళ్లి చేసుకొన్న వ్యక్తిని నేరేడ్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వినాయకనగర్‌కు చెందిన తుపాకుల రమేష్‌ (32) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఓల్డ్‌ సఫిల్‌గూడకు చెందిన కరుణశ్రీని వివాహం చేసుకొన్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. కరుణశ్రీకి పదహారేళ్ల సోదరి ఉంది. ఆమెపై కన్నేసిన రమేష్‌ తల్లిదండ్రులేని సమయంలో తరచూ వారి ఇంటికి వెళ్లి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టాడు. ఆమె తిరస్కరించింది.
Loading...


గత మార్చిలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెపై కొన్నిసార్లు లైంగికదాడి చేశాడు. భార్యకు ‘నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని’ చెప్పగా, ఆమె మందలించి వదిలేసింది. ఈ క్రమంలో గత నెల 25న బాలికను బలవంతంగా యాదగిరి గుట్టకు తీసుకెళ్లి పెళ్ళి చేసుకున్నాడు. తర్వాత తిరుపతి తీసుకెళ్లాడు. గత నెల 31న తల్లిదండ్రుల ఇంటి వద్ద ఆమెను వదిలి వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్కో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)