ఎంగేజ్మెంట్ తర్వాత తనకు కాబోయే భార్యతో చాటింగ్ చేస్తూ, ఫోన్ లో మాట్లాడుతూ న్యూడ్ సెల్పీ కావాలని అడిగాడు


Loading...

ఆ పెళ్లి పీటలెక్కక ముందే ఆగిపోయింది. వరకట్నం కోసం పీటల మీద ఆగిన పెళ్ళిలను చూశాం, మనస్పర్థల కారణంగా ఆగిన పెళ్లిలను చూశాం, ఆస్తి పాస్తుల దగ్గర ఆగిన పెళ్లిళ్ళను చూశాం… ఆఖరికి అబ్బాయికో , అమ్మాయికో వేరే ఎఫైర్ ఉందని తెలిసి సడెన్ గా రద్దయిన పెళ్లిళ్ళను కూడా చూశాం .. కానీ ఈ పెళ్లి మాత్రం పెళ్లి కొడుకు మితిమీరిన వింత కోరికతో ఆగింది. మహారాష్ట్ర కు చెందిన జితేంద్ర రాధాకృష్ణ కు ఓ అమ్మాయి తో పెళ్లి నిశ్చయం అయ్యింది. ఎంగేజ్మెంట్ తర్వాత తనకు కాబోయే భార్యతో… చాటింగ్ చేస్తూ , ఫోన్ లో మాట్లాడుతూ గడిపాడు జితేంద్ర. చివరకు ఓ రాత్రి చాట్ చేస్తూ ..చాట్ చేస్టూ .. న్యూడ్ సెల్పీ కావాలని అమ్మాయిని అడిగాడు.
Loading...

అదే పనిగా వేధించడం స్టార్ట్ చేశాడు. పంపుతావా లేదా నేను నిన్ను కట్టుకోబోయే వాడినే అంటూ బ్లాక్ మెయిలింగ్ కూడా చేశాడు. వరుడి వింత ప్రవర్తన చూసి ఆ అమ్మాయి తన తల్లీదండ్రులకు చెప్పింది. దీంతో అమ్మాయి తరఫు వాళ్లు ఏకంగా ఆ పెళ్లినే కాన్సల్ చేసుకున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు . దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జితేంద్ర ను అరెస్ట్ చేశారు. అంతకు ముందే అబ్బాయికి కట్నం కింద 3 లక్షలను కూడా ఇచ్చారు. టెక్నాలజీ పెరిగిందనేది వాస్తవమే, కానీ టెక్నాలజీని వాడుకునే విధానం మాత్రం ఇది కాదు. కుర్రాళ్లు కాస్త జాగ్రత్త..

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)