సినిమా ఇండస్ట్రీకి వచ్చి పతివ్రత అంటే నమ్ముతారా..

Loading...

Loading...

ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం చెలరేగిన సమయంలో నటి అపూర్వ కూడా ఈ పోరాటంలో పాలు పంచుకుంది. శ్రీరెడ్డికి మద్దత్తుగా నిలిచింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కోచ్ పోరాటం అనేక మలుపులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పోరాటం మొదలు పెట్టిన సమయలో ఆమెకు అద్భుతమైన మద్దత్తు లభించింది. కొందరు నటీనటులు, ప్రజా సంఘాలు శ్రీరెడ్డికి అండగా నిలిచాయి. తాజగా జరిగిన ఇంటర్వ్యూ లో నటి అపూర్వ పలు ఆసక్తికర విషయాలని టాలీవుడ్ గురించి వివరించారు. శ్రీరెడ్డి ఆవేశంలో పవన్ కళ్యాణ్ తల్లిని దూషించిందని నటి అపూర్వ అన్నారు. కాని అది చాలా పెద్ద తప్పు. అలాంటి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఏమాత్రం సహనం కోల్పోలేదు.
Loading...

ఆయనకు సహనం ఎక్కువ. శ్రీరెడ్డిని ఏమీ అనలేదని అపూర్వ అన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అంతే సహనంతో ఉండాలని అపూర్వ కోరింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజా నాయకుడు అని ఈ సమయంలో ఆయన అభిమానులు సహనం ప్రదర్శించాలని అన్నారు. ఇండస్ట్రీలోకి ఏ అమ్మాయి అయినా బ్యాగ్రౌండ్ లేకుండా వెళితే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని అపూర్వ అన్నారు. కొత్తగా వచ్చిన అమ్మాయిలని పడుకోవడానికి కమిట్మెంట్ అడుగుతారని తెలిపింది. కమిట్మెంట్ ఇవ్వ్వకుండా ఒకవేళ ఛాన్స్ వచ్చినా సినిమా మొత్తం వేధిస్తారని అపూర్వ అన్నారు. ఒప్పుకున్న వారిని మాత్రం వేధించరని అపూర్వ తెలిపింది. తన కెరీర్ ఆరంభంలో కూడా కమిట్మెంట్ అడిగారని అపూర్వ అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఆ సినిమా మొత్తం వేధిస్తూనే ఉన్నారు. సినిమాలో ఏ ఆర్టిస్టు కోపరేట్ చేయలేదు అని అపూర్వ తెలిపింది. డైరెక్టర్ తిడుతూనే ఉన్నారు.
Loading...

మరో చిత్రంలో కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని అపూర్వ అన్నారు. అప్పుడు కూడా తాను అంగీకరించలేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి పతివ్రత అంటే నమ్ముతారా అని తిట్టి వెళ్లిపోయారని అపూర్వ అన్నారు. అల్లరి చిత్రం హిట్టయ్యాక తనని ఎవరూ వేధించలేదని అన్నారు. కానీ నటన పరంగా కొందరి హీరోలతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయం కొద్దీ సరదాగా డిన్నర్, డ్రైవ్ కు వెళదామని అడిగినవారు ఉన్నారు. ఎవరూ బలవంత పెట్టలేదని అపూర్వ తెలిపింది. రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో నటిస్తే అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. వారి దృష్టి పనిమీదే ఉంటుంది. ఇండస్ట్రీలో 60 శాతం మంచి వారు ఉంటే 40 శాతం చెడు వ్యక్తులు కూడా ఉన్నారని అపూర్వ తెలిపింది.
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...