నువ్వు ఆ పని చేస్తే నెలకు 50వేలు జీతం ఇస్తానని యువతికి చెప్పి ఫ్లాట్ అద్దెకు తీశాడు


Loading...

డబ్బు మీద ఆశతో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ చేసిన పని అందరూ అవాక్కయ్యేలా చేసింది. పాతికవేలు జీతం వస్తున్నా కూడా ఇంకా డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఓ యువతిని ముగ్గులోకి దించి.. ఆమెతో వ్యభిచారం చేయించాలని ఫిక్స్ అయిపోయాడు. అనుకున్నట్లుగానే ఆన్ లైన్ లో డీటెయిల్స్ పెట్టాడు.. కానీ మన సైబరాబాద్ పోలీసులు ఆ యాడ్ ను గుర్తించి కాంటాక్ట్ చేయగా.. అడ్డంగా దొరికిపోయాడు.
Loading...

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరుజిల్లా దర్గామిట్ట ప్రాంతానికి చెందిన షేక్‌ రహ్మాన్‌ (22) ఇంజినీరింగ్‌ చేసి రూ. 25 వేల జీతానికి ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా ఎక్కువ డబ్బులు ఎలాగైనా సంపాదించాలన్న ఉద్దేశంతో, ఓ బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న ఒంగోలుకు చెందిన యువతిని పరిచయం చేసుకున్నాడు. తాను చెప్పిన పని చేస్తే నెలకు రూ. 50 వేలు ఇస్తానని చెప్పి వ్యభిచారం చేసేందుకు ఆమెను ఒప్పించాడు. ఇద్దరూ కలసి బంజారాహిల్స్‌ రోడ్డు నం. 12లో ఓ ప్లాట్ ను అద్దెకు తీసుకున్నారు.
Loading...

ఆ యువతి ఫొటోలను ఆన్‌ లైన్‌ లో పెట్టి, విటులను ఆకర్షించే ప్రయత్నం చేశాడు రెహ్మాన్. ఇక్కడే రెహ్మాన్ ఇచ్చిన యాడ్ పోలీసుల కంటపడింది. వెంటనే అతడికి ఫోన్ చేయగా.. ఎక్కడికి రావాలో డీటెయిల్స్ చెప్పాడు. అక్కడికి వెళ్ళిన పోలీసులు యువతిని, రెహ్మాన్ ను పట్టుకున్నారు. డబ్బులు సంపాదించాలన్న ఒకే ఒక్క కారణంతోనే ఈ పని చేశామని రెహ్మాన్ చెప్పాడు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)