షాక్..విడాకుల దిశగా తెలుగు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి.. పెళ్ళయి రెండేళ్ళు కూడా కాలేదు అప్పుడే విడాకులు


Loading...

గమ్యం, వేదం, కంచె, గౌతమీ పుత్రశాతకర్ణి లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిష్ జాగర్లమూడి కెరీర్ పరంగా తక్కువ సినిమాలతో మంచి పొజిషన్‌కు వెళ్లారు. ప్రస్తుతం బాలీవుడ్లో ప్రతిష్టాత్మక 'మణికర్ణిక' చిత్రం చేస్తున్న ఆయన ఈ మూవీ పూర్తయిన వెంటనే తెలుగులో 'ఎన్టీఆర్ బయోపిక్' చేయబోతున్నారు. క్రిష్ ప్రొఫెషనల్ లైఫ్ బావున్నప్పటికీ పర్సనల్‌ లైఫ్‌లో సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం క్రిష్ తన భార్య రమ్యతో విడాకులకు సిద్ధమవుతున్నారు. కారణాలు ఏమిటో తెలియదు కానీ క్రిష్, ఆయన భార్య రమ్య విడాకులకు సిద్ధమయ్యారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇద్దరూ డైవర్స్ ఫైల్ చేసినట్లు సమాచారం. క్రిష్-రమ్య వివాహం 2016లో జరిగింది. రెండేళ్లు కూడా గడవక ముందే ఇద్దరూ విడాకులకు సిద్ధమవ్వడంతో క్రిష్ అభిమానులు షాకవుతున్నారు.
Loading...

వీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమిటనేది ఇంకా బయటకు రాలేదు. పెళ్లయిన దగ్గర నుండి క్రిష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నారు. రమ్య హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో తన వైద్య వృత్తిని కొనసాగిస్తున్నాను. వృత్తి పరంగా ఇద్దరూ ఎక్కువ కాలం దూరంగా ఉండటం వల్లే దంపత్య జీవితంలో సమస్యలు మొదలయ్యాయని, అందుకే దూరం పెరిగిందని అంటున్నారు. చివరకు పరస్పర అంగీకారానికి వచ్చి విడాకులకు సిద్ధమైనట్లు సమాచారం. క్రిష్‌. రమ్య వివాహం హైదరాబాద్‌లోని గోల్కొండ రిసార్ట్‌లో ఆగస్టు 2016లో జరిగింది. ''దేవతలే బంధువుల్లా వస్తారంట... మీరొస్తే ఒక దేవతొచ్చినట్టే... మీ కోసం మీ ఆశీస్సుల కోసం వేదమంత్రాలు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయని మర్చిపోకండి.
Loading...

మీరు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి నన్నూ మా ఆవిడ్నీ ఆశీర్వదించాలని మా అమ్మ అంజనాదేవి, నాన్నగారు సాయిబాబుగారు కూడా మీకు మరీ మరీ చెప్పమన్నారు''... నా సినీ జీవితం 'గమ్యం'తో మొదలైతే, నా అసలు జీవితం ఇప్పుడు 'రమ్యం'గా మొదలవుతోంది... మీ ఆశీస్సులు కావాలంటూ క్రిష్‌ పంపిన ఆహ్వానంతో ఇండస్ట్రీ ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే రెండేళ్లు కూడా నిండక ముందే వీరి దాంపత్య జీవితం ముక్కలవ్వడంతో అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)