అన్నలా చూసుకుంటాను అని ఇద్దరూ ఒకే గది తీసుకుని ఉంటున్నారు.. రాత్రి పని కానిచ్చేసాడు ఉదయం లేచే సరికి ఆమెకు విషయం అర్థమైంది


Loading...

భర్తతో గొడవ పడి దూరంగా ఉంటున్న యువతికి మాయమాటలు చెప్పాడు. సోదరిలా చూసుకుంటా.. కంప్యూటర్‌ కోర్సు నేర్పించి మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మించి నగరానికి తీసుకొచ్చాడు. నగరంలో గది అద్దెకు తీసుకొని ఇద్దరు నివసిస్తున్నారు. యువతికి మూర్ఛ వ్యాధి ఉండడంతో రాత్రివేళల్లో నిద్ర మాత్ర వేసుకుని పడుకుంటుంది. ఇదే అదునుగా భావించి ఆ యువతిపై అత్యాచారం చేశాడు. నమ్మించి మోసం చేశాడని ఆ యువతి నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికులు, పోలీసులు సకాలంలో ఆస్పత్రిలో చికిత్స చేయించి ప్రాణాలు కాపాడారు. నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.
Loading...

ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రోహిత్‌ ఠాగూర్‌ కంప్యూటర్‌ కోర్సు నేర్చుకునే రోజుల్లో ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. యువతికి అప్పటికే వివాహమైంది. అనంతరం భర్తతో వివాదాల కారణంగా దూరంగా ఉంటోంది. ఈ విషయాన్ని గమనించిన రోహిత్‌ ఠాగూర్‌ నమ్మకంగా ఆ యువతి పంచన చేరాడు. సోదరిలా చూసుకుంటాను, హైదరాబాద్‌ తీసుకెళ్లి కంప్యూటర్‌ కోర్సు నేర్పించి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి నగరంలోని బేగంపేటలో ఉన్న అన్నానగర్‌ ప్రాంతంలో పది రోజుల క్రితం గది అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు.
Loading...

యువతికి మూర్ఛ వ్యాధి ఉండడంతో నిద్రమాత్ర వేసుకుంటుంది. ఈ విషయాన్ని గమనించిన రోహిత్‌ ఠాగూర్‌ ఈనెల 27న రాత్రి యువతిపై అత్యాచారం చేశాడు. మరుసటి రోజు ఉదయం రాత్రి జరిగిన ఘటనపై యువతి అతనిని నిలదీసింది. దీంతో అత్యాచారం చేసినట్టు ఒప్పుకోవడంతో అవమానం భరించలేని ఆ యువతి 15 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయం తెలిసిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అనంతరం యువతి నుంచి ఫిర్యాదు తీసుకుని అత్యాచారానికి పాల్పడిన రోహిత్‌ ఠాగూర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)