పేకాట‌లో ఓడిపోయాడు..ఒక రాత్రి కోసం త‌న భార్య‌ను వాళ్లింటికి పంపాడు


Loading...

పేకాట‌లో ఓడిపోయిన ఓ వ్య‌క్తి డ‌బ్బులు చెల్లించ‌లేక‌పోయాడు. దానికి ప‌రిహారంగా.. త‌న భార్య‌ను ఒక రాత్రి కోసం త‌న పేకాట ప్ర‌త్య‌ర్థి ఇంటికి పంపించాడు. స్నేహితుడి భార్య అని కూడా చూడ‌కుండా ఆమెపై అత్యాచారం చేశాడా కిరాత‌కుడు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బ‌లికుటి పంచాయ‌తీ ప‌రిధిలోని మ‌ల‌న్గ్‌బ‌లికుటి గ్రామానికి చెందిన అభిరామ్ ద‌లాల్ అనే వ్య‌క్తికి 16 ఏళ్ల కింద‌ట పెళ్ల‌యింది. అత‌నికి భార్య, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అభిరామ్ ద‌లాల్ పేకాట‌కు బానిస అయ్యాడు. పేకాట‌లో వేల రూపాయ‌ల‌ను పోగొట్టుకున్నాడు. ఇంట్లో ఖ‌రీదైన వ‌స్తువుల‌ను కూడా తాక‌ట్టు పెట్టి మ‌రీ పేకాట ఆడేవాడు. ఈ నెల 22వ తేదీన అభిరామ్ ద‌లాల్ పేకాట ఆడాడు. అదే గ్రామానికి చెందిన త‌న స్నేహితుడితో పేకాట ఆడి పెద్ద మొత్తంలో డ‌బ్బును పోగొట్టుకున్నాడు. చివ‌రికి భార్య‌ను తాక‌ట్టు పెట్టి పేకాట ఆడాడు. ఓడిపోయాడు.
Loading...

డ‌బ్బులు క‌ట్ట‌క‌పోతే- భార్య‌ను త‌న వ‌ద్ద‌కు పంపాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు అత‌డి స్నేహితుడు. దీనితో అదే రోజు రాత్రి అభిరామ్ ద‌లాల్ త‌న భార్య‌కు మాయ‌మాట‌లు చెప్పి, పొలానికి తీసుకెళ్లాడు. అప్ప‌టికే అక్క‌డ అత‌ని స్నేహితుడు ఉన్నాడు. త‌న భార్య‌ను అత‌నికి అప్ప‌గించి, ఇంటికి వెళ్లిపోయాడు. పేకాట‌లో బాకీ ప‌డిన త‌న‌ను స్నేహితుడి వ‌ద్ద‌కు పంపించాడ‌నే విష‌యం ఆమెకు తెలియ‌దు. త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. అత‌ను వ‌ద‌ల్లేదు. ఆమెపై అత్యాచారం చేశాడు. రాత్రంతా హింసించాడు. బాధితురాలు రెండో రోజు ఈ విష‌యాన్ని త‌న తండ్రికి వివ‌రించారు. దీనితో అత‌ను బ‌లియాపల్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. పోలీసుకు కేసు న‌మోదు చేయ‌లేదు. ఇరు వ‌ర్గాల‌ను పిలిపించి, కౌన్సెలింగ్ ఇస్తామ‌ని అన్నారు.
Loading...

కేసు న‌మోదు చేయ‌క‌పోవ‌డంతో బాధితురాలు జిల్లా కేంద్ర‌మైన బాలాసోర్‌కు వెళ్లి ఎస్పీ కార్యాల‌యంలో ఫిర్యాదు చేశారు. బాలాసోర్ ఎస్పీ జుగ‌ల్ కిశోర్‌కుమార్ బానోత్‌.. స్వ‌యంగా ఆమె ఫిర్యాదును స్వీక‌రించారు. ఈ కేసుపై ద‌ర్యాప్తు చేయాల‌ని బ‌లియాప‌ల్ పోలీసుల‌ను ఆదేశించారు. నిందితుడితో పాటు అభిరామ్ ద‌లాల్ పైనా కేసు న‌మోదు చేస్తామ‌ని అన్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)