దారుణం నిండు గర్భినిపై ఆటో డ్రైవర్‌, మరో ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం


Loading...

దేశ రాజధానికి కూతవేటు దూరంలో దారుణం జరిగింది. మనేసర్‌లో 23 ఏళ్ల గర్భిణిపై ఆటో డ్రైవర్‌, మరో ఇద్దరు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. భర్తతో కలిసి చెకప్‌ కోసం సైకిల్‌పై ఆస్పత్రికి వెళుతుండగా ఈ నెల 21న ఈ జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆస్పత్రి నుంచి తిరిగివస్తుండగా సైకిల్‌పై తనకు అసౌకర్యంగా ఉందని చెప్పడంతో ఆటోలో సమీప గ్రామానికి రావాలని భర్త చెప్పాడని, ఎంతసేపటికీ ఆమె ఇంటికి తిరిగిరాలేదని పోలీసులు తెలిపారు.
Loading...

ఘటన జరిగిన నాలుగు రోజుల అనంతరం తనపై లైంగికదాడి జరిగిందని బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆటో డ్రైవర్‌ ఇచ్చిన నీరు తాగిన అనంతరం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. బిహార్‌కు చెందిన బాధితురాలు మనేసర్‌లో భర్త, కుమారుడితో కలిసి ఉంటున్నారు. మనేసర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో నిందితులపై సామూహిక లైంగిక దాడి కేసును నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)