పిల్లల కోసం దంపతులిద్దరూ కలిసి మాంత్రికుడి దగ్గరికి వెళితే భర్తను కట్టేసి భార్యను రేప్ చేసిన మాంత్రికుడు


Loading...

ఇటీవల దొంగ బాబాలు, మంత్ర గాళ్లు ఎక్కువైపోతున్నారు. ఎన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నా జనాల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. తమ ఇబ్బందులను తొలగిస్తాడని ఆశ్రమానికి వెళితే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హౌరా ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయ దంపతులిద్దరు సంతానం కోసమని భూపతినగర్‌లో ఉన్న రెహమత్‌ అలీ షేక్‌ అనే మాంత్రికుడి ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ తన అనుచరులతో భర్తను స్థంబానికి కట్టేసి బాబా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
Loading...

అనంతరం ఆమె వద్ద ఉన్న ఆభరణాలను, డబ్బును తీసుకొని వదిలేశారు. విషయం​ బయటకు చెప్పకూడదని మాంత్రికుడు షేక్‌ వారిని బెదిరించారు. ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన దంపతులు సమీప పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆశ్రమానికి వెళ్లి మాంత్రికుడు రెహమత్‌ అలీ షేక్‌ను అరెస్ట్‌ చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి మోస పోవడం గమనార్హం.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)