స్పిన్న‌ర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య‌ను జుట్టు ప‌ట్టుకుని కొట్టారు


Loading...

టీమిండియా స్పిన్నర్‌, చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఆట‌గాడు రవీంద్ర జడేజా భార్య రీవా సోలంకి జ‌డేజాపై ఓ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ దాడి చేశాడు. అకార‌ణంగా ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. జ‌ట్టు ప‌ట్టుకుని కొట్టాడు. ఈ సంఘటన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో చోటు చేసుకుంది. రీవా జ‌డేజా సోమ‌వారం జాగ‌ర్స్ పార్క్ ప్రాంతంలోని త‌న నివాసం నుంచి బీఎండ‌బ్ల్యూ కారులో షాపింగ్ కోసం బ‌య‌లుదేరారు. సాయంత్రం సుమారు 6 గంట‌ల స‌మ‌యంలో సరూ సెక్ష‌న్ మార్గంలో ఆమె వెళ్తుండ‌గా.. రాంగ్‌రూట్‌లో వ‌చ్చిన ఓ సంజ‌య్ ఆహిర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్‌తో రీవా జ‌డేజా కారును ఢీ కొట్టారు. అది వ‌న్ వే అయిన‌ప్ప‌టికీ.. ట్రాఫిక్ కానిస్టేబుల్ రాంగ్‌రూట్‌లో వ‌చ్చారు.
Loading...

అయిన‌ప్ప‌టికీ- సంజ‌య్ ఆహిర్ ఆమెతో గొడ‌వ పెట్టుకున్నాడు. ఘ‌ర్ష‌ణ ప‌డ్డాడు. తీవ్ర స్వ‌రంతో రీవా జ‌డేజాతో వాగ్వివాదానికి దిగాడు. స్థానికులు వారిస్తున్న‌ప్ప‌టికీ.. అత‌ను వినిపించుకోలేదు. రీవాపై దాడి చేశాడు. ఆమె చెంప ఛెళ్లుమ‌నిపించాడు. జుట్టు ప‌ట్టుకుని కొట్టాడు. దీనితో ఆమెకు స్వ‌ల్ప గాయాలు కూడా అయ్యాయి. స్థానికులు, తోటి వాహ‌న‌దారులు పెద్ద సంఖ్య‌లో చేరుకోవ‌డంతో సంజ‌య్ అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు.
Loading...

గాయ‌ప‌డ్డ రీవాను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ విష‌యం తెలుసుకున్న జామ్‌న‌గ‌ర్ ఎస్పీ ప్ర‌దీప్ సెజ‌ల్ స్వ‌యంగా ఆసుప‌త్రికి వెళ్లారు. ఆమె స్టేట్‌మెంట్ తీసుకున్నారు. సంజ‌య్ ఆహిర్‌పై కేసు న‌మోదు చేశారు. అత‌ణ్ని అరెస్టు చేశారు. సంజ‌య్‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎస్పీ హామీ ఇచ్చారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)