సంప్రదాయం పేరుతో రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలతో సుఖంగా సంసారం చేసుకుంటున్న అరుదైన గ్రామం


Loading...

సంప్రదాయం మాటున ఒక్కో పురుషుడు రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్దరు భార్యలతో సుఖంగా సంసారం చేసుకుంటున్న అరుదైన గ్రామం రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్ ప్రాంతంలో వెలుగుచూసింది. జైసల్మేర్ ప్రాంతంలోని మారుమూల ఏడారి గ్రామమైన దేరాసర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాందీయోకీ బస్తీలో ప్రతీ రెండిళ్లలో ఒకరు రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇద్ధరు భార్యలతో సుఖంగా సంసారం చేస్తున్న ఉదంతం బయటపడింది. రాందీయోకీ బస్తీలో 2011 జనాభా లెక్కల ప్రకారం 946 మంది జనాభా నివాసముంటున్నారు.
Loading...

మొదటి భార్యకు ఆడపిల్లలు పుడితే, రెండో పెళ్లి చేసుకుంటే చాలు రెండో భార్యకు తప్పనిసరిగా మగబిడ్డ పుడతాడని రాందీయోకీ బస్తీవాసుల నమ్మకం. ఇద్దరు భార్యలున్నా వారిద్దరూ వేర్వేరుగా కాకుండా ఒకే ఇంట్లో కలిసి మెలసి ఒకే వంటగదిలో వంట చేస్తూ భర్తతో కలిసి జీవనం కొనసాగిస్తుండటం మరో విశేషం. జైసల్మేర్, బార్మర్ ప్రాంతాల్లో మైనారిటీలు రెండు పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. వారితోపాటు రాందీయోకీబస్తీవాసుల్లో ఎక్కువ మందికి ఇద్దరు భార్యలుండటం సర్వసాధారణంగా మారింది.
Loading...

సుఖంగా... సంతోషంగా...ఇద్దరు భార్యలతో కాపురం :- ఇద్దరు భార్యలున్నా వారి మధ్య సవితి పోరు లేకుండా సుఖంగా, సంతోషంగా కలిసిమెలసి సహజీవనం సాగిస్తుండటం మరో విశేషం. భార్యభర్తల మధ్య, సవతుల మధ్య గ్రామంలో ఒక్క వివాదం కూడా ఏర్పడలేదు. వారంతా శాంతియుతంగా కలిసి మెలసి జీవనం కొనసాగిస్తుంటారని మదరసా ఉపాధ్యాయుడు దోస్త్ అలీ చెప్పారు. ఇదే బస్తీకి చెందిన ముహమ్మద్ షరీఫ్, ఖాసింలకు ఇద్దరు చొప్పున భార్యలున్నారు. ముహమ్మద్ షరీఫ్ మొదటి భార్యకు పిల్లలు పుట్టకపోవడంతో అతను రెండో పెళ్లి చేసుకోగా పిల్లలు పుట్టారు. ఖాసిం మొదటి భార్యకు ఆడపిల్లలు కాగా రెండో పెళ్లి చేసుకోవడం మగబిడ్డ జన్మించాడని మౌల్వీ నిష్రూఖాన్ వివరించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)