అక్రమ సంబంధం మోజులో ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది..ఎంత తెలివిగా భర్తను చంపిందంటే..


Loading...

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడన్న కారణంతో భర్తను హతమార్చిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెనుకొండ డీఎస్పీ కరీముల్లా షరీఫ్‌ తెలిపిన మేరకు... సోమందేపల్లి మండలం ఈదులబ ళాపురం వద్ద ఏప్రిల్‌ 30న కాలిన మృతదేహా న్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు తెలియకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నా రు. చివరకు మృతుడిని సోమందేపల్లిలోని కొత్తపల్లి క్రాస్‌కు చెందిన వడ్డే రాముగా గుర్తించామన్నారు. పూర్తి విచారణ చేపట్టగా వడ్డేరామును అతడి భార్య లక్ష్మీదేవి, ప్రియు డు అశోక్‌, బంధువులు వడ్డే శిల్ప, నరసింహ ప్పలతో కలిసి హత్య చేసినట్లు తేలిందన్నారు.
Loading...

ఏప్రిల్‌ 30న ఇంటిలో ఉన్న రామును మద్య సేవించేలా చేశారు. అనంతరం అతడి కళ్లపై యాసిడ్‌ పోశారు. అపస్మారకస్థితిలో ఉన్న అతడిని ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్తు న్నట్లు నటించి ఈదులబళాపురం వద్దకు తీసుకెళ్లారు. అక్కడే సమీపంలోని పొదలవద్ద మృతుడి గొంతు నులిమి ఎదభాగంలో బలం గా కొట్టి హత్య చేశారన్నారు. అనుమానం రాకుండా వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ బాటి ల్‌తో మృతదేహానికి నిప్పంటించారన్నారు. లక్ష్మీదేవికి కొంతకాలంగా చల్లాపల్లికి చెందిన అశోక్‌తో వివాహేతర సంబంధం కొనసాగు తుండేదని ఈ విషయం తెలిసిన రాము తన భార్యను మందలించేవాడని వివరించారు. అంతేకాక మృతుడు తనకున్న ఒక ఎకరా ఆస్తిలోని సగభాగాన్ని బంధువులకు ఇచ్చేందుకు ఇటీవలే అంగీకరించాడని తెలిపారు.
Loading...

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండటంతోపాటు ఆస్తిని వేరొకరికి ఇస్తాడన్న ఆలోచనతో రామును హత్యచేశారని పేర్కొ న్నారు. ఈ హత్యకు బంధువులైన శిల్ప, నరసింహప్పలు సహకరించారని వివరించారు. నిందితులు నలుగురు సోమందేపల్లి మండలం చాకర్లపల్లిలో ఉండగా సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ ప్రసాద్‌లు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ వివరించారు. వీరిని కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)