ఆ క‌లెక్ట‌ర్ మ‌రుగుదొడ్డి గుంత‌లోకి దిగి అందులో ఉన్న వ్య‌ర్థాల‌ను స్వ‌యంగా చేతుల్తో బ‌య‌ట‌కు తీశారు. షాకింగ్‌


Loading...

మ‌హారాష్ట్ర‌లోని పూణెలో తాజాగా స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌పై వ‌ర్క్ షాప్ నిర్వ‌హించారు. అందులో ప‌లు రాష్ట్రాల‌కు చెందిన ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీలు, ప్రాజెక్టు డైరెక్ట‌ర్లు, పంచాయ‌తీ రాజ్‌, రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగాల క‌మిష‌నర్లు పాల్గొన్నారు. వంద శాతం వ్య‌క్తిగ‌త మ‌రుగుదొడ్ల నిర్మాణ ల‌క్ష్యం పూర్త‌య్యేందుకు ఏమేం చ‌ర్య‌లు తీసుకోవాలో ఈ వ‌ర్క్‌షాప్‌లో చ‌ర్చించారు. కాగా ఇందులో మెద‌క్ జిల్లా క‌లెక్ట‌ర్ కె.ధ‌ర్మారెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే ఆయ‌న అక్క‌డ చేసిన ప‌ని అంద‌రినీ షాక్‌కు గురి చేసింది.
Loading...

క‌లెక్ట‌ర్ ధ‌ర్మారెడ్డి పూణె జిల్లాలోని దౌండ్ బ్లాక్ లో ఉన్న పందారేవాడ‌లో ఓ మ‌రుగుదొడ్డి గుంత‌లోకి దిగారు. అనంత‌రం అందులో సేంద్రీయ ఎరువుగా మారిన మ‌లాన్ని స్వ‌యంగా చేతుల్తో బ‌య‌ట‌కు త‌వ్వి తీశారు. దీంతో ఆయ‌న చేసిన ప‌నిని అంద‌రూ షాకింగ్‌గా, ఆశ్చర్యంగా చూశారు. మరుగుదొడ్ల‌లో ఉండే మ‌లం సేంద్రీయ ఎరువుగా మారుతుంద‌ని అలాంప్పుడు చేత్తో తీయ‌డం త‌ప్పేమీకాద‌ని ఆయ‌న స‌మ‌ర్థించారు. ఇక ఈ విషయం ఇప్పుడు యావ‌త్ దేశ వ్యాప్తంగా చ‌ర్చనీయాంశ‌మే అవుతోంది. అయితే నిజానికి తెలంగాణ రాష్ట్రంలోని మెద‌క్ బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న ర‌హిత ప్రాంతంగా గ‌తంలోనే పేరు గాంచింది. రాష్ట్రంలో ఈ పేరు తెచ్చుకున్న 8వ జిల్లా మెద‌క్ కావ‌డం విశేషం. ఈ క్ర‌మంలోనే ఆ జిల్లా క‌లెక్ట‌ర్ ఇలా చేయ‌డం అంద‌రినీ షాక్‌కే కాదు, ఆశ్చ‌ర్యానికి కూడా గురి చేసింది.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)