పైకి చూడండి కింద కాదు రేష్మి నీతిసూత్రం


Loading...

తెలుగు రాష్ట్రాల్లో రేష్మికి అంత క్రేజ్ వచ్చింది అంటే కేవలం ‘జబర్దస్త్ కామెడీ షో’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే తాను ‘జబర్దస్త్ కామెడీ షో’ ద్వారా యాంకర్‌గా ప్రయాణం మొదలు పెట్టి నేటితో ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకుంది రేష్మి. ఈ సందర్భంగా.. జబర్దస్త్ కామెడీ షోలో గత నాలుగు సంవత్సరాలుగా.. 260 వారాలను కంప్లీట్ చేసుకున్నందుకు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ.. తలపైకెత్తి చూస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ఆ ఫోటోకు తగ్గట్లుగా అద్భుతమైన కొటేషన్‌ను చెప్పేసింది. ‘మీ చూపు ఎప్పుడూ పైకే ఉండాలి అప్పుడే ఆశీస్సులు ఉంటాయి.
Loading...

కిందకు చూస్తే అగాధంలోనే పడిపోతారు’.. అంటూ నీతిసూక్తులు చెప్పుకొచ్చింది రేష్మి. నిజమే గ్లామర్ ప్రపంచంలో రాణించాలంటే కష్టం, నష్టం అన్నీ తెలిసుండాలి. రేష్మి కెరియర్ కూడా కష్టాలతోటే ప్రారంభమైంది. తాను ఇష్టపడ్డ కెరియర్‌ను వదులుకోలేక కుటుంబాన్ని వదిలి హైదరాబాద్ వచ్చి.. కేవలం రూ.10 వేల పారితోషికంతో కెరియర్ మొదలు పెట్టి ఒక్కోమెట్టూ ఎక్కుతూ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. అయితే యాంకర్ అంటే ఇలాగే ఉండాలి.. ఇలానే యాంకరింగ్ చేయాలి.. తెలుగులో అనర్గళంగా మాట్లాడాలి.. కట్టు బొట్టు ఇలానే ఉండాలి లాంటి కండీషన్స్ ఈ జబర్దస్త్ యాంకర్స్‌కి వర్తించవనే చెప్పాలి.
Loading...

ప్రేక్షకులు మమ్మల్ని ఇలా చూడాలని కోరుకుంటున్నారు.. వారిని నచ్చిన విధంగా ఎంటర్‌టైన్ చేయడమే మా బాధ్యత.. అంటూ పలు ఇంటర్వ్యూలలో తెగేసి చెప్పింది రేష్మి. మొత్తానికి బుల్లితెర గ్లామరస్ డాల్ రేష్మి మంచి మాటకారి అని తాజా పోస్ట్‌తో నిరూపించుకుంది.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)