అమ్మాయి వాళ్ళకి కొంత డబ్బిచ్చి అబ్బాయితో ఉండనిస్తారు.. పిల్లలు పుట్టాక పెళ్లి చేసుకుంటారు


Loading...

ప్రపంచంలోని ప్రతీ ప్రాంతంలోనూ ఏదో ఒక ప్రత్యేక ఆచారం కనిపిస్తుంటుంది. ఇక వివాహం విషయానికొస్తే మరి చెప్పనవసరం లేదు. మన దేశంలోని ఆ గ్రామంలో కొన్నేళ్లుగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్(సహజీవనం) అనేది ఆచారంగా కొనసాగుతూ వస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్, సిరోహి, పాలీ జిల్లాలలో నివసించే గర్సియా జాతి ప్రజలు పెళ్లికిముందు సహజీవనం చేస్తారు.
Loading...

ఒక శిశువు పుట్టిన తరువాత వివాహం చేసుకోవాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటారు. ఈ జాతివారంతా మహిళలకు ఎంతో గౌరవం ఇస్తారు. అందుకే వీరి జాతిలో మహిళలపై దురాగతాలు జరగడం బహు అరుదు. వీరంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. అబ్బాయి ఇంట్లోని వారు అమ్మాయి కుటుంబ సభ్యులకు కొంత సొమ్ము ఇచ్చి శోభనం ఏర్పాటు చేస్తారు. తరువాతనే వారిద్దరి లివ్ ఇన్ రిలేషన్‌షిప్ కొనసాగుతుంది. బిడ్డ పుట్టాక వారి వివాహాన్ని అబ్బాయి కుటుంబ సభ్యులే నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఈ జాతి యువతులు తమకు నచ్చిన తమ జాతి యువకునితో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండేందుకు అవకాశం ఉంటుంది.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)