19 ఏళ్ళ రిసెప్షనిస్ట్ 20 ఏళ్ళ రూమ్ బాయ్.. ఇంకా పెళ్లి వయసు కాదని చెప్పినా వినలేదు


Loading...

ప్రేమ విఫలమైందనే బాధతో ఓ యువతి భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విజయవాడ  వాంబేకాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. వాంబేకాలనీ హెచ్‌ బ్లాకులో నివాసం ఉంటున్న పోతిరెడ్డి రజని (19) నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. ఈనెల 16న ఆస్పత్రికి వెళ్లిన యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో 17వ తేదీన ఆమె బంధువులు రజని కనిపించడంలేదని నున్న రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదేరోజు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అయితే, యువతి పనిచేస్తున్న ఆస్పత్రిలో రూమ్‌ బాయ్‌గా ఉన్న తుళ్లూరులోని పెదపురిమికి చెందిన ఓనమా గోపీ (20) అనే యువకుడిని ప్రేమించి అతనితో హైదరాబాద్‌ వెళ్లిన యువతి.. 17వ తేదీ రాత్రి సదరు యువకుడిని తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది.
Loading...

తాను గోపీని ప్రేమించానని, అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో స్థానిక పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలను పిలిపించారు. గోపీకి పెళ్లి వయస్సు సరిపోదని, రెండేళ్ల తరువాత వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించుకుని ఇళ్లకు పంపించేశారు. వాంబేకాలనీలోని తన ఇంటికి వెళ్లిన రజని తీవ్ర మనస్తాపానికి గురైంది. మధ్యాహ్నం భోజనం సమయంలో తల్లి ఇంట్లో ఉండగా బయట గడియ పెట్టిన రజని భవనంపైకి వచ్చింది. తల్లి ఇంట్లో నుంచి వారిస్తుండగానే అక్కడి నుంచి దూకేసింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువతిని బంధువులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి వరకు చికిత్స పొంది మృతిచెందింది. కేసు నమోదుచేసిన నున్న రూరల్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Loading...


Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)