వేరుకాపురం పెట్టట్లేదని మామ మీదే రేప్ కేసు పెట్టిన కోడలు పాపం ఆ అవమానం భరించలేక ఆ మామగారు


Loading...

ఓ మామ మీద కోడలు వేసిన నిందను భరించలేకపోయాడు. దీంతో అతడు అవమానభారం తట్టుకోలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భోపాల్ రాష్ట్రం లోని థాటీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీవనీ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. జీవనీ నగర్ లో నివసించే రమేష్ బాథమీ తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు ఆత్మహత్య చేసుకున్న కొద్ది రోజులకు ముందు అతడి కోడలు రేప్ కేసు పెట్టింది. దీంతో బుధవారం అర్ధరాత్రి రమేష్ కేబుల్ వైర్ల సాయంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
Loading...

ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం పంపించారు. ఈ ఘటన గురించి రమేష్ కొడుకు మాట్లాడుతూ.. తన భార్య తండ్రి మీద తప్పుడు కేసు పెట్టిందని.. ఆ బాధను భరించలేక సూసైడ్ చేసుకున్నాడని చెప్పుకొచ్చాడు. తన భార్య ఎప్పటి నుండో వేరు పడాలని భావిస్తోందని.. ఇప్పటికే పలుమార్లు ఆమె తమను విడిచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది అని చెప్పుకొచ్చాడు. ఎన్నో సార్లు పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ బ్రతిమలాడి పిలుచుకొని వచ్చినట్లు రమేష్ కొడుకు చెప్పాడు. మే 15న ఆమె తన పిల్లలను తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిందని..
Loading...

పోలీసులతో తన మామ అత్యాచారం చేయబోయాడని ఫిర్యాదు చేసిందని.. ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఏడుస్తూ చెప్పాడు రమేష్ కొడుకు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)