సన్నీలియోన్ రూ.100 కోట్ల సినిమా.. ఇదిగో ఫస్ట్‌లుక్ శృంగార తార నుండి వీరనారిగా


Loading...

ఇండియాలో సన్నీలియోన్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ వేస్తేనే కుర్రకారు ఊగిపోతారు. అలాంటిది సినిమా మొత్తం ఆమె కనిపిస్తే ఇక పండగే. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. ఇది అందాలు ఆరబోసే చిత్రం కాదు. చారిత్రాత్మక చిత్రం ‘వీరమహాదేవి’. ఇందులో సన్నీ ధైర్యసాహసాలు కలిగిన రాణి పాత్రలో కనిపించనున్నారు. వి.సి.వడివుడయాన్ దర్శకత్వంలో స్టివ్స్ కార్నర్ పతాకంపై ఫోన్స్ స్టీఫెన్ నిర్మిస్తున్నారు. రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒకేసారి ఐదు భాషల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని సన్నీ ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఇండియాలో సన్నీలియోన్ రేంజ్ ఏంటో అందరికీ తెలిసిందే. సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ వేస్తేనే కుర్రకారు ఊగిపోతారు. అలాంటిది సినిమా మొత్తం ఆమె కనిపిస్తే ఇక పండగే. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చి పడింది. ఇది అందాలు ఆరబోసే చిత్రం కాదు. చారిత్రాత్మక చిత్రం ‘వీరమహాదేవి’. ఇందులో సన్నీ ధైర్యసాహసాలు కలిగిన రాణి పాత్రలో కనిపించనున్నారు. వి.సి.వడివుడయాన్ దర్శకత్వంలో స్టివ్స్ కార్నర్ పతాకంపై ఫోన్స్ స్టీఫెన్ నిర్మిస్తున్నారు.
Loading...

రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒకేసారి ఐదు భాషల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలోని సన్నీ ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు. సన్నీలియోన్ తెలుగులో మొదటిసారి పూర్తిస్థాయిలో నటిస్తున్నందున ఆమె తెలుగు నేర్చుకుంటున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోని ప్రముఖ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. నాజర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. యుద్ధ సన్నివేశాల కోసం సుమారు 1000 గుర్రాలు, ఏనుగులను ఉపయోగిస్తున్నట్లు, నటీనటులకు గుర్రపుస్వారిలో శిక్షణ ఇస్తున్నట్లు నిర్మాత తెలిపారు. సన్నీలియోన్ దుస్తులు దక్షిణభారత సంప్రదాయంలో ఉంటాయని, అందుకని వాటిని ముంబైలో తయారు చేస్తున్నామని వెల్లడించారు. రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. కేరళలోని అడవులలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నామని, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నందున కెనడాలోని ఓ సంస్థ, ఇండియాలోని ఒక కంపెనీతో కలసి పనిచేస్తున్నామని చెప్పారు.
Loading...

‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’, ‘గాడ్స్ ఆఫ్ ది ఈజిప్ట్’ చిత్రాలకు పనిచేసిన విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారని తెలిపారు. గ్రాఫిక్స్ కోసం సుమారుగా 40 కోట్లు ఖర్చుపెడుతున్నామని, ఈ చిత్రం కోసం సన్నీలియోన్ 150 రోజుల కాల్షీట్లు ఇచ్చారని చెప్పారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)