17 ఏళ్ళ అబ్బాయితో పెళ్ళైన 30 ఏళ్ళ మహిళ అక్రమసంబంధం లేచిపోయిమరీ సంసారం చివరికి


Loading...

బాలుడితో ఓ వివాహిత అక్రమ సంబంధం.. ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైన సంఘటన కుమురం భీం జిల్లా జైనూరు మండలంలోని ఉషేగాం గ్రామ పంచాయతీ పరిధిలోని ఫరా గ్రామంలో కలకలం సృష్టించింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన 17 సంవత్సరాల బాలుడు..
Loading...

అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరూ రెండు రోజుల క్రితం గ్రామం నుంచి వెళ్లిపోయారు. ఈ తతంగంతో నివ్వెరపోయిన కుటుంబీకులు వారి ఆచూకీ తెలుసుకొని బుధవారం ఇంటికి తీసుకొని వచ్చి బాలుడిని మందలించారు. చుట్టుపక్కల బంధువులు వచ్చి బాలుడిని సముదాయించే ప్రయత్నం చేసి చీవాట్లు పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు గురువారం పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని చూసిన కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందజేసి చికిత్స నిమిత్తం హుటాహుటిన ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు.
Loading...

పరిస్థితి విషమించడంతో బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సీఐ సాదిక్‌పాషా సందర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)