చేతులారా లివర్ ను దెబ్బతీసుకోకండి.. ప్రాణాలు కోల్పొకండి.. ఈ జాగ్రత్తలు పాటించండి


Loading...

మ‌న శ‌రీరంలో లివ‌ర్ అత్యంత పెద్ద‌దైన అవ‌య‌వం. ఇది చేసే ప‌నులు ఎంతో ముఖ్య‌మైన‌వి. మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాల‌న్నా, శ‌రీరానికి శ‌క్తి స‌రిగ్గా అందాల‌న్నా, విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లాల‌న్నా లివ‌ర్ ఎంతో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. అయితే నేటి త‌రుణంలో మ‌నం తింటున్న అనేక ఆహార ప‌దార్థాలు, ప‌లు వ్యాధులు, అల‌వాట్లు లివ‌ర్ చెడిపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. కాలేయం దెబ్బ తినడానికి దారితీసే కారణాలనేకం. మోతాదును మించి మందులు వేసుకోవడం కూడా వాటిలో ఒకటి. చాలామంది డాక్టర్‌ సలహాతో పనిలేకుండా వాళ్ల ఇష్టానికి మందులు కొనుక్కుని తోచిన మోతాదులో వేసుకుంటుంటారు. ఇలాంటి అలవాట్ల వల్ల మధ్య వయసులోనే కాలేయం దెబ్బతిని, ప్రాణాపాయ పరిస్థితికి దారి తీస్తుంది. ఇలాకాకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్‌ సలహా తప్పనిసరి అంటున్నారు నిపుణులు. ఆకలి కోసమో, శరీర పోషణ కోసమో లేదా ఆహ్లాదం కోసమో తీసుకునే ఆహార పానీయాలు ఏవైనా జీర్ణాశయం గుండా కాలేయానికి చేరాల్సిందే. అవన్నీ రక్తప్రసరణతో కలిసి కాలేయం నుంచి పయనించాల్సిందే. మనం తీసుకునే పోషకాల్లోని హానికారక పదార్థాలన్నింటినీ వడబోసే కీలక బాధ్యతను కాలేయం నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియ అంత సులభమైనదేమీ కాదు. ఈ భారం మరీ అధికమైనప్పుడు ఒక్కోసారి కాలేయం దెబ్బతినే ప్రమాదం ఏర్పడవచ్చు. ఇలా దెబ్బతినే పరిణామాల వెనుక డాక్టర్‌ ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా మందులు కొనుక్కుని వేసుకునే అలవాటొకటి ప్రధాన కారణంగా ఉంటోంది. చ‌క్కెర లేదా తీపి అధికంగా ఉన్న ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయం దెబ్బ తింటుంది.
Loading...

చ‌క్కెరను అతిగా తింటే అది శ‌రీరానికి ఉప‌యోగం కాదు స‌రిక‌దా, అది మొత్తం లివ‌ర్‌లోనే పేరుకుపోయి కొవ్వుగా మారుతుంది. దీంతో కొంత కాలానికి లివ‌ర్ ప‌నితీరు మంద‌గించి అది చెడిపోతుంది. నేటి త‌రుణంలో ఆహార ప‌దార్థాల‌ను రుచిగా అందించ‌డానికి వాటిలో మోనోసోడియం గ్లుట‌మేట్ అనే ప‌దార్థాన్ని ఎక్కువ‌గా క‌లుపుతున్నారు. దీంతో ఈ ప‌దార్థం ఉన్న ఆహారాన్ని తిన్న‌ప్పుడు అది మ‌న శ‌రీరంలోకి ఎక్కువ‌గా చేరుతోంది. దీని ప్రభావం ఎక్కువ‌గా ప‌డ‌డంతో లివ‌ర్ చెడిపోతోంది. విట‌మిన్ ఎ ఉన్న ఆహారం తీసుకుంటే కంటి సంబంధ స‌మ‌స్య‌లు ఉండ‌వ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ విట‌మిన్ శ‌రీరంలో మోతాదుకు మించినా దాని ప్ర‌భావం లివ‌ర్‌పై ప‌డుతుంద‌ట‌. దీంతో లివ‌ర్ ఆరోగ్యం నాశ‌న‌మ‌వుతుంద‌ట‌. కూల్‌ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల కూడా కాలేయం త్వరగా చెడి పోతుంది. కూల్‌ డ్రింక్స్ లో ఉండే పదార్థాలు కాలేయాన్ని పని చేయకుండా చేస్తాయి. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాల శాతం అధికంగా పెరుగుతుంది. దాంతో కాలేయ సంబంధిత వ్యాధులు వస్తాయి. ఉప్పువల్ల రక్తపోటు కూడా వస్తుందనే విషయం తెలిసిందే.
Loading...

చిప్స్‌ వంటి ఆహార ప‌దార్థాల‌ను ఎక్కువగా తిన్నా వాటిలో ఉండే విష‌పూరిత‌మైన ప‌దార్థాలు లివ‌ర్ ఆరోగ్యంపై ప్ర‌భావాన్ని చూపుతాయి. కాబ‌ట్టి వాటికి కూడా దూరంగా ఉండ‌డం మంచిది. అధిక బ‌రువు ఉన్న‌వారు కూడా లివ‌ర్ ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాలి. శ‌రీరంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతే ఫ్యాటీ లివ‌ర్ డిసీజ్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో లివ‌ర్ ఫెయిల్ అవుతుంది కూడా. డ‌యాబెటిస్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి లివ‌ర్ వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం 50 శాతం వ‌ర‌కు ఉంటుంది. ఉప్పు ఎక్కువ‌గా తింటే దాంతో బీపీ పెరిగి అది ఫ్యాటీ లివ‌ర్ వ్యాధికి దారి తీస్తుంది. క‌నుక ఉప్పును చాలా త‌క్కువ‌గా తిన‌డం మంచిది. యాంటీ డిప్రెస్సెంట్స్‌, మూడ్ స్టెబిలైజ‌ర్స్‌, కార్టికోస్టెరాయిడ్స్‌, పెయిన్ రిలీవ‌ర్స్ వంటి ప‌లు ర‌కాల మెడిసిన్‌ల‌ను దీర్ఘ కాలం వాడినా లివ‌ర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. డాక్ట‌ర్ల సిఫార‌సు లేకుండా సొంతంగా మందుల‌ను వాడినా లివ‌ర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. క్యాన్స‌ర్ చికిత్స కోసం చేసే కీమోథెర‌పీ వ‌ల్ల కూడా లివ‌ర్ చెడిపోతుంది. హెపటైటిస్ ఎ, బి, సి వంటి వ్యాధులు వ‌చ్చిన‌ప్పుడు స‌రైన స‌మ‌యంలో స్పందించి చికిత్స చేయించుకోకపోయినా లివ‌ర్ ఆరోగ్యం దెబ్బ తింటుంది. పేగుల్లో ఇన్‌ఫెక్షన్లు ఏర్ప‌డి అవి తీవ్ర‌త‌ర‌మైనా లివ‌ర్ చెడిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. క్రిమి సంహారక మందుల‌ను వాడి పండించిన కూర‌గాయ‌లు, పండ్ల‌ను తింటే వాటితో ఆ మందులు కూడా మ‌న శ‌రీరంలోకి వెళ్తాయి. అప్పుడు ఆ మందులు లివ‌ర్‌పై ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఓటిసి (ఓవర్‌- ద- కౌంటర్‌) డ్రగ్స్‌, హెర్బల్‌, పాల ఉత్పత్తులకు సంబంధించినవి కాలేయాన్ని దెబ్బ తీస్తున్నాయి. కొందరిలో ఇది ప్రాణాపాయానికే దారి తీయవచ్చు. ఏళ్లపర్యంతంగా మందులు వాడే వారిలో కూడా డి.ఐ.ఎల్‌.ఐ (డ్రగ్‌ ఇండ్యూస్డ్‌ లివర్‌ ఇంజ్యురీ) అంటే మందుల వల్ల కాలేయం దెబ్బతినే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటోంది. దాదాపు వెయ్యిరకాల మందులు, సప్లిమెంట్లు వంటి వ్యర్థాలతో కాలేయం నిండిపోయి హైపటోటాక్సిసిటీకి కారణమవుతున్నట్లు పలు అధ్యయనాల్లో స్పష్టమయ్యింది. కాకపోతే ఒకసారి ఆ మందులు మానేస్తే దెబ్బ తిన్న కాలేయం తిరిగి చక్కబడే అవకాశం ఉంది. మిగతా వారితో పోలిస్తే వయసు పైబడిన వారిలో ఈ సమస్య రెండురెట్లు అధికంగా ఉంటోంది. అందుకే తాము వేసుకునే మందుల దుష్ప్రభావాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. అంతకన్నా ముందు ఓటిసి మందులు వేసుకునే అలవాటు నుంచి బయటపడాలి. వృద్ధాప్య దశలో మందుల్ని జీర్ణించుకునే శక్తి బాగా తక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో వారు మోతాదును మించి మందులు వేసుకుంటే కాలేయ వ్యాధిగ్రస్తులయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు కాంబినేషన్‌లో ఒకేసారి పలురకాల మందుల్ని వేసుకుంటున్నప్పుడు కాలేయం పాడయ్యే అవకాశాలు చాలా రెట్లు అధికంగా ఉంటాయి. పురుషుల కన్నా స్త్రీలే ఈ డ్రగ్‌ ఇండ్యూస్డ్‌ లివర్‌ ఇంజ్యురీ బారిన పడే ప్రమాదం ఉందని పలు అధ్యయనాల్లో బయటపడింది. వారసత్వకారణాలు, పోషకలోపాలు, అతిగా మద్యం సేవించడం, మధుమేహం, హ్యూమన్‌ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్‌, స్థూలకాయం, కాలేయంలో ఉండే వ్యాధులు కూడా మలినాల్ని శుద్ధి చేసే శక్తిని దెబ్బ తీస్తాయి. కాలేయ వ్యాధికి కారణమవుతాయి. కొన్ని రకాల మందుల్ని అతిగా వాడటం వల్ల వచ్చే దుష్పరిణామాలను ఇంట్రిన్సిక్‌ రియాక్షన్స్‌ అంటారు. ఉదాహరణకు పారసెట్మాల్‌ మాత్రలు చాలా సురక్షితమైనవి అన్న ప్రచారముంది. కానీ ఎక్కువ మోతాదులో వేసుకుంటే అవి కూడా కాలేయాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంది. అలాగే ఎక్కువ మంది తరచూ వాడే పెయిన్‌ కిల్లర్లు ఉదాహరణకు క్రోసిన్‌, కాంబిఫ్లామ్‌, సినరెస్ట్‌ మాత్రల్ని అతిగా వాడినా ఈ కాలేయ సమస్యలు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాస్తవానికి పారసెట్మాల్‌ ఒక మోతాదుకు వెయ్యి మిల్లీగ్రాములకు మించకూడదు. ఆ మేరకు కొద్ది రోజుల పాటు రోజుకు నాలుగు గ్రాములకు మించకుండా తీసుకోవాలి. పారసెట్మాల్‌ అతి వినియోగం వల్ల ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వైద్యం కోసం యాంటీఆక్సిండెంట్‌ ఎ-అసిటైల్‌సిస్టీన్‌ అనే మందుల్ని ఇస్తుంటారు. అయితే ఇంకా కొన్ని రకాల మందుల దుష్ప్రభావాలు ఎలా ఉంటాయన్నది చాలా పరిశోధనల తర్వాత కూడా స్పష్టం కాలేదు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)