కూతురుకి ఐశ్వర్య లిప్ కిస్.. అసభ్యకర కామెంట్లు.. తల్లీ కూతుళ్ల ప్రేమను బూతు చేస్తారా.. మరీ ఇంతదారుణమైన కామెంట్లు పెడతారా


Loading...

సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు వాళ్లు వీళ్లు అనే తేడాలేదు. ఎవరినైనా మన సోషల్ సోగ్గాళ్లు ట్రోల్ చేసేస్తారు. ముఖ్యంగా సెలబ్రిటీలను అస్సలు వదలరు. తాజా ఈ ట్రోలింగ్‌కు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ బలయ్యారు. మదర్స్ డే నాడు ఐశ్వర్యరాయ్ తన కూతురితో దిగిన ఒక ఫొటోను ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
Loading...

ఆ ఫొటోలో కూతురు ఆరాధ్య బచ్చన్‌ పెదాలను ఎంతో ప్రేమతో ఆమె ముద్దాడుతున్నట్లు ఉంది. ‘బేషరుతుగా నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రపంచలోనే అత్యంత సంతోషకరమైన అమ్మను’ అని ఐశ్వర్య క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ ఫొటో ఐశ్వర్వ అభిమానులు, శ్రేయోభిలాషులను అమితంగా ఆకట్టుకుంది. ఈ తల్లీ కూతుళ్లను చూసి వారు తెగ మురిసిపోయారు. కానీ ట్రోల్ రాజాలు మాత్రం అసభ్యకర కామెంట్లతో రెచ్చిపోయారు. ఒక తల్లి ప్రేమతో కూతురు పెదాలను ముద్దాడటంలో తప్పేముందని ఐష్ అభిమానులు అంటుంటే.. ట్రోల్ రాజాలు మాత్రం దానిలో బూతును వెతుకుతున్నారు.
Loading...

వాస్తవానికి తన బిడ్డల్ని ఏ తల్లైనా ముద్దాడుతుంది. అది పెదాలపైనా, నుదుటిపైనా, బుగ్గలపైనా అనేది అసందర్భం. ఈ భూమి మీద అందరు తల్లులూ తమ బిడ్డల్ని ఏదో ఒక సమయంలో పెదాలపై ముద్దాడే ఉంటారు. అది బిడ్డలపై తల్లికి ఉన్న అమితమైన ప్రేమ మాత్రమే. దీన్ని తప్పుగా చూపుతూ అసభ్యకర కామెంట్లు చేయడం ఎంత వరకు సమంజసం.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)