నమ్మించి.. లోబర్చుకున్నాడు. అంతటితో ఆగలేదు... తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు.. మరోసారి అదే తీరులో


Loading...

ప్రేమన్నాడు.. నువ్వే లోకం అన్నాడు.. ఓ మైనర్‌ను ముగ్గులోకి దించాడు. నమ్మించి.. లోబర్చుకున్నాడు. అంతటితో ఆగలేదు... తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడు. అంతేకాదు.. మరోసారి అదే తీరులో అత్యాచారానికి ప్రయత్నించాడు.. అక్కడే కథ మలుపు తిరిగింది.. నల్లగొండ జిల్లాలో.. మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డ ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దామరచర్ల మండల కేంద్రానికి చెందిన షేక్‌ సయ్యద్ పాషా.. ఎర్రంకాలనీలో ఉంటున్న ఓ పేద బాలికపై కన్నేశాడు.
Loading...

ప్రేమంటూ వెంటపడ్డాడు. ఆమెను నమ్మించి.. శారీరకంగా అనుభవించాడు. ఆ విషయాన్ని తన స్నేహితులు షేక్ అల్లా భక్షీ, రవికుమార్ కు చెప్పాడు.. ముగ్గురూ కలిసి ఆమెను రేప్ చేయడానికి ప్లాన్ చేశారు. మార్చి 29న రాత్రి ఇంటికి వెళ్తున్న ఆ బాలికను తీసుకుని కొత్తగా కడుతున్న ఓ అపార్ట్‌మెంట్‌లోకి తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితులనూ పిలవడంతో వాళ్లూ ఆమెపై అత్యాచారం చేశారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. ఈ ముగ్గురూ చేసిన పనికి ఆ బాలికి కుమిలిపోయింది. పరువు పోతుందన్న భయంతో మౌనంగా ఉండిపోయింది. అయితే.. మే పదో తేదీన మరోసారి పాషా.. ఆమెను బలవంతంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించడంతో..
Loading...

తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ముగ్గురినీ అరెస్ట్ చేశారు. నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి.. కోర్ట్‌ రిమాండ్‌కు పంపారు పోలీసులు. ప్రేమ పేరుతో కల్లబొల్లి కబుర్లు చెప్పే వారి మాటలు చెప్పేవారితో జాగ్రత్తంటూ అమ్మాయిలను హెచ్చరిస్తున్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)