బర్త్ డే జరుపుకోవడం అంటే ఎవరికైనా సరదాయే. ముఖ్యంగా స్నేహితులు ఒక్క చోట కలిశాక ఎవరి బర్త్ డే అయినా వస్తే సెలబ్రేట్ చేసుకోకుండా ఉండలేరు కదా. ముందుగా ఒక ప్లేస్ ఎంచుకుంటారు. డెకరేషన్లు చేస్తారు. కేక్ కోస్తారు. చివరకు విందు భోజనం ఆరగిస్తారు. డ్యాన్సులు చేస్తూ బర్త్ డే వేడుకలను జరుపుకుంటారు. అంత వరకు బాగానే ఉంటుంది. కానీ బర్త్ డే వేడుకలో ఏదైనా అనుకోని సంఘటన జరిగితే..? అవును, అలా జరిగితే అప్పుడు నవ్వులు పోయి విషాదం మిగులుతుంది. ఓ యువతి బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంది.
స్నేహితుల నడుమ హ్యాపీగా కేక్ కట్ చేసింది. అయితే అంతలోనే చిన్నపాటి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆమె క్యాండిల్ వెలిగించగానే ఆ మంట పైనే ఉన్న బెలూన్స్‌కు తాకింది. దీంతో బెలూన్స్ పగిలాయి. అయితే అవి సాధారణ బెలూన్స్ అయితే ఏమీ కాకపోవును. కానీ అవి హైడ్రోజన్ గాలి నింపిన బెలూన్స్. దీంతో వాటిల్లో ఉండే గాలి మంటకు తాకి ఆ మంటలు ఇంకా ఎక్కువగా వ్యాపించాయి. ఒకేసారి బెలూన్స్ పగలడంతో పెద్ద ఎత్తున మంట వచ్చింది. అలా మంట వచ్చేసరికి బర్త్ డే జరుపుకున్న ఆ యువతికి గాయాలయ్యాయి. ఫొటోల్లో ఆమెను చూడవచ్చు. కనుక ఎవరైనా బర్త్ డే చేసుకోండి. కానీ హైడ్రోజన్ బెలూన్స్‌ను వాడేముందు జాగ్రత్త వహించండి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.
అలాగే బర్త్ డే సందర్భంగా ఒకరిపై ఒకరు చేసుకునే స్ప్రేలను కూడా మంటకు దూరంగా ఉంచండి. లేదంటే అవి కూడా అగ్నిని త్వరగా గ్రహించి అగ్ని ప్రమాదానికి కారణమవుతాయి. కనుక ఈ రెండు వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి..!