పోలీసులను చూడగానే ఏటీఎంలో దూరి బట్టలు మార్చుకున్న అమ్మాయిలు


Loading...

జూబ్లీహిల్స్ పోలీసులను టోకరా కొట్టించేందుకు ఇద్దరు అమ్మాయిలు ఓ ప్లాన్ వేశారు. పోలీసులను చూడగానే వారు ఏటీఎం లోకి వెళ్ళి.. ఒకరి బట్టలు మరొకరు మార్చేసుకున్నారు. ఇంతకూ ఇదంతా ఎందుకు జరిగిందంటే మీకు అసలు స్టోరీ తెలియాలి..! జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఎప్పటిలాగే రాత్రి సమయంలో పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఇంతలో ఓ ఖరీదైన కారు ఆ రోడ్డు మీదకు వచ్చింది. బ్లాక్ టీషర్టు ధరించిన ఓ యువతి ఫుల్లుగా మందు తాగి, కాస్తంత తక్కువగా తాగిన తన మరో స్నేహితురాలితో కలసి వస్తోంది.
Loading...

జూబ్లీహిల్స్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలను నిర్వహిస్తున్న పోలీసులను దూరంగానే గమనించేసింది ఆ యువతి. ఆ తర్వాత వెంటనే కారు పక్కన ఆపి, ఇద్దరూ కిందకు దిగారు. కారు నుండి ఎవరో దిగిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా బ్లాక్ టీషర్ట్ ధరించిన అమ్మాయి కారు నడిపిందని గమనించారు. ఆపై కారు దగ్గరకు వారు చేరుకునేలోగానే, పక్కనే ఉన్న ఏటీఎంలోకి వెళ్ళారు ఇద్దరు అమ్మాయిలు. ఇంతకూ ఏటీఎం లోకి ఎందుకు దూరారనే కదా.. తమ దుస్తులను మార్చేసుకోడానికి. ఎందుకంటే ఫుల్ గా మద్యం తాగిన అమ్మాయి దొరికిందంటే పోలీసులు చర్యలు తీసుకుంటారు కాబట్టి..! అక్కడి నుంచే మద్యం తాగని తమ స్నేహితుడిని పిలిపించుకున్నారు. అతను వచ్చే సమయానికి నిమిషం ముందు వీరిద్దరూ బయటకు వచ్చారు.
Loading...

వీరిని చూసిన పోలీసులు, కారును రోడ్డుపై ఎందుకు ఆపారని ప్రశ్నిస్తుండగానే, వీరి స్నేహితుడు వచ్చి, కారు తనదని చెప్పాడు. అతనికి డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష నిర్వహించగా, బీఏసీ సున్నాగా చూపించింది. దీంతో చేసేదేమీ లేక రాంగ్ పార్కింగ్ కింద ఫైన్ విధించి పోలీసులు వెళ్లిపోయారు. ఇలా ఆ అమ్మాయిలు ప్రస్తుతానికి తప్పించేసుకున్నారని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు.

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)