ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి..20 ఏళ్ల కుర్రాడు వివాహేత‌ర సంబంధం


Loading...

భువ‌నేశ్వ‌ర్‌: ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి, 20 ఏళ్ల కుర్రాడి మ‌ధ్య ఏర్ప‌డిన వివాహేత‌ర సంబంధం.. విషాదాంతమైంది. త‌మ వివాహేత‌ర సంబంధం గుట్టుర‌ట్టు కావ‌డంతో వారిద్ద‌రూ ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఊరి బ‌య‌ట చెట్టుకు నిర్జీవంగా వేలాడారు. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని బార్‌ఘ‌ర్ జిల్లా సోహెల పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని కెండుముండి గ్రామంలో చోటు చేసుకుంది. సోహెల పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోకే వ‌చ్చే గ్రింజెన్ గ్రామానికి చెందిన గ‌ణేష్ సేథ్ డిగ్రీ విద్యార్థి. జిల్లా కేంద్రం బార్‌ఘ‌ర్‌లో డిగ్రీ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు.
Loading...

అత‌నికి మెహెర్‌పాడా గ్రామంలో నివ‌సించే ఓ వివాహిత‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం వివాహేత‌ర సంబంధానికి దారి తీసింది. అప్ప‌టికే ఆమెకు నాలుగేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె ఉన్నారు. త‌మ వ్య‌వ‌హారం బ‌య‌టికి తెలియ‌డంతో ప‌రువు పోతుందనే ఉద్దేశంతో ఇద్ద‌రూ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. కెండుముండి గ్రామ శివార్ల‌లో చెట్టుకు ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డారు. చెట్టుకు వేలాడుతున్న మృత‌దేహాల‌ను చూసిన స్థానికులు సోహ‌ల పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)