బస్సులో మహిళల ముందే వికృత చేష్టలు.. ప్యాంటు జిప్ పై చేయి వేసి అసహ్యంగా సైగలు.. వీడియో తీస్తుందని తెలియక మరింత రెచ్చిపోయాడు


Loading...

బస్సులో మహిళల ముందే వికృత చేష్టలకు దిగాడు ఓ కామాంధుడు. వారికి సైగలు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కండక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవటంతో ఆ తతంగం అంతా వీడియో తీసిన ఓ యువతి ఫేస్‌బుక్‌లో అప్‌ లోడ్‌ చేసింది. ఆ వీడియో కాస్త వైరల్‌ అయి పోలీసులకు చేరింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే... హూగ్లీ జిల్లా వైద్యపతి ప్రాంతానికి చెందిన సదరు వ్యక్తి ఓ చిరు వ్యాపారి. శనివారం శ్యామ్‌పుకర్‌ ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తూ.. మహిళా ప్రయాణికులను చూస్తూ యువతులను చూస్తూ అసభ్య చేష్టలకు దిగాడు.
Loading...

ప్యాంటు జిప్ పై చేయి వేసి రుద్దుకుంటూ అమ్మాయిలకు సైగ చేసాడు. అది గమనించిన ఇద్దరు మహిళలు కండక్టర్‌తో చెప్పారు. కానీ, అతని నుంచి స్పందన లేకపోవటంతో మౌనంగా ఉండిపోయారు. ఇంతలో ఓ యువతి ఆ వ్యాపారి చేష్టలను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌ లోడ్‌ చేసింది. ఎవరూ పట్టించుకోలేదని, మహిళలకు భద్రత ఏదంటూ పోస్టు చేసింది. అది కాస్త గంటల్లో వైరల్‌ అయి కోల్‌కతా పోలీసులకు చేరింది. ఇలాంటి వ్యవహారాల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని, అతన్ని శనివారం సాయంత్రమే అరెస్ట్‌ చేసినట్లు కోల్‌కతా పోలీసులు ఫేస్‌బుక్‌లో తెలియజేశారు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)