చదువుతుంటేనే సావిత్రికి మొక్కాలని అనిపించింది.. నేనది పీకాను, నేనిది పీకాను అని చెప్పుకునే సెలేబ్రిటీలు ఇది ఒక్కసారి చదవండి

Loading...

Loading...

మహానటి సినిమా చూసినవారిలో చాలామందికి ఓ సందేహం… నిజంగా సావిత్రి దయాగుణం అంత గొప్పదా..? సంపాదించినదంతా సమాజం కోసం ఇచ్చేసిందా..? ఆమె చేతికి ఎముకే లేదా..? నిజమేనా..? అవును, ఈ తరానికి అవన్నీ తెలియాలని లేదు కదా… కానీ Wiral అనే ఓ ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్టు కనిపించింది… బాగుంది… సావిత్రి కర్ణస్వరూపం ఏమిటో తేటతెల్లం చేసే అద్భుతమైన ఉదాహరణ అది… చదువుతుంటేనే సావిత్రికి మొక్కాలని అనిపించింది… ఎందుకు..? ఇప్పుడు కోటానుకోట్లు సంపాదిస్తూ, పేరుకు పత్రికల ఇంటర్వ్యూలలో నేనది పీకాను, నేనిది పీకాను అని చెప్పుకునే చాలా మంది సెలెబ్రటీల ఫేక్ ఔదార్యపు మాటలతో పోలిస్తే సావిత్రి నిజంగా ఎంత గ్రేట్..? ఓసారి ఆ పోస్టు చదవండి…
Loading...


Loading...

నాకు తెలిసిన సావిత్రి గారు ( దాత )… నేను రేపల్లె స్టేట్ బ్యాంకు లో 1972 నుండీ 1984 వరకు పని చేసాను … అప్పుడు Correspondent S S G H School వడ్డివారిపాలెం పేర మా బ్యాంకు లో Current Account ఉండేది … S S G H School అంటే శ్రీమతి సావిత్రి గణేశన్ హైస్కూల్ అని అర్ధం… సావిత్రి గారు తన స్వగ్రామములో పేద విద్యార్ధుల సౌకర్యార్ధం స్థాపించిన స్కూల్ అది … కేవలం సావిత్రి గారి ఆర్ధిక సహాయముతోనే స్థాపించబడిన స్కూలు అది … ఆ తర్వాత ప్రభుత్వము వారిచే గుర్తించబడి , కొంత ఆలస్యముగా ప్రభుత్వము వారిచే ఉపాధ్యాయులకు నెలసరి జీతములు విడుదల చేయబడుతూ నడపపడుతున్న స్కూలు అది …
Loading...

గవర్నమెంటు గ్రాంటు లేకపోతే ఆరు నెలలైనా ఉపాధ్యాయులకు జీతాలు అందేవి కావు …

వారి స్కూలు తరఫున ఉద్యోగి తమ స్టాఫ్ జీతములందరి చెక్కు మార్చుకొనడానికి మా బ్యాంకుకు వచ్చే వారు …

సావిత్రి గారి మీద ఉన్న అభిమానముతో ఆ ఉద్యోగులను పలకరిస్తుండే వాడిని …

షుమారు అయిదు నెలలు మా బ్యాంకు తో పని పడక ఆ స్కూలు వారెవరూ మా బ్యాంకు కు రాలేదు …

ఒక రోజు నేను మా బ్యాంకు లో Current Account Counter లో పని చేస్తున్నప్పుడు ఆ స్కూలు ఉద్యోగి సావిత్రి గారి సంతకముతో ఉన్న రూ.104000 /_ రూపాయల మద్రాసు ( ఇప్పుడు చెన్నై ) చెక్కు క్లియరెన్స్ కోసము తమ ఖాతాలో జమ చేయడానికి తీసుకుని వచ్చారు …

1975 ప్రాంతంలో రూ. 104000 /- అంటే ఈ రోజుల్లో షుమారు రూ. 40 లక్షలు పైనే …

మామూలుగా ఆ ఖాతాలో గవర్నమెంటు బిల్లు జమ చేయబడ్డాక Correspondent సంతకం చేసిన చెక్కు ద్వారా డబ్బులు Withdraw చేసుకుంటారు …


అదీ Regular గా జరిగే Procedure…

దానికి భిన్నంగా సావిత్రి గారి సంతకముతో తమ స్కూలు ఖాతాలో జమ చేయడానికి చెక్కు రావడంతో ఆసక్తి ఆపుకోలేని నేను ” ఇదేమిటి సర్ !! రొటిన్ కు భిన్నంగా సావిత్రి గారి సంతకముతో చెక్కు తెచ్చారు ? ” అని అడిగాను …

దానికి అతను ” ఈ మధ్య సావిత్రి గారు స్కూలు ఎలా నడుస్తోంది ? అని మా Corrspondent గారిని ఫోనులో అడిగారు సర్ . దానికి మా Correspondent గారు అయిదు నెలల నుండీ ప్రభుత్వ గ్రాంటు లేక పని చేసే ఉపాధ్యాయులకు , సిబ్బందికి జీతాలు లేవమ్మా తిండికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా అని చెప్పారు. ఆ విషయం విన్న సావిత్రి గారు Correspondent గారిని వెంటనే మద్రాసు రమ్మన్నారు .
మా Correspondent గారు వెంటనే మద్రాసు వెళ్ళారు .
సిబ్బందికి అయిదు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న సావిత్రి గారు ఎంతో కదిలిపోయి తన స్వంత డబ్బులు రూ. 104000 /- మొత్తం అయిదు నెలలు బకాయిలకు చెక్కు రాసిచ్చి ముందు సిబ్బంది బకాయిలు చెల్లించండి. తర్వాత గ్రాంట్ సంగతి మనం చూసుకోవచ్చును అని అన్నారు సర్. ” అని నాకు చెప్పారు .

ఇంతకన్నా ఆ మహాతల్లి దాతృత్వానికి నిదర్శనం ఏం కావాలి ?

సావిత్రి గారికి నీరాజనాలతో …

Source
Rtd Repalle Bank Manager
ఒక సారి జాయిన్ అయితే చాలు లైఫ్ టైం ఆదాయం వస్తూనే ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి OneAD app install చేసుకోండీ. ఈ Refer code - 92AT5ZLF5 ఎంటర్ చేసి జాయిన్ అవ్వండి. నెలకు 60 వేలు సంపాదించండి
Loading...

Popular Posts

Latest Posts

Loading...