స్నేహితురాలే కదా అని ఇంటికి రానిస్తే.. బెడ్‌రూంలోకి దూరి


Loading...

మీర్‌పేట పరిధిలో స్నేహితురాలి ఇంట్లో ఓ యువతి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన మరువకముందే, అలాంటి ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. నిందితులను అరెస్టు చేసిన సరూర్‌నగర్‌ పోలీసులు శనివారం రిమాండుకు తరలించారు. కేసు వివరాలను ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీ ఎంవీ రావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వంగవోలు సవితాదేవి సరూర్‌నగర్‌ హుడా కాలనీలో రామ్మోహన్‌ టవర్స్‌లో ఉంటూ శ్రీవిద్య విహార్‌ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేసేది. 5నెలల పాటు ఉద్యోగం చేసిన ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం మానేసింది. హుడా కాంప్లెక్స్‌ క్రాంతిహిక అపార్టుమెంట్‌లో ఉంటూ ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్న జంపన శ్రీవిద్య మూడు నెలల క్రితం ఆమెకు పరిచమైంది. సవితాదేవి తరచూ వారింటికి వస్తుండేది.
Loading...

గతేడాది ఆగస్టు నెలలో శ్రీవిద్య ఇంట్లో దొంగతనం చేయాలని ఆమె పథకం వేసుకుంది. సవితాదేవిపై నమ్మకంతో శ్రీవిద్య ఆమెకు ఇల్లు అప్పగించి వెళ్లగానే, బెడ్‌రూంలోని 14 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించింది. వాటిని కొన్నింటిని మెడికల్‌ షాప్‌ యజమాని గోషిక నర్సింహాకు రూ.75 వేలకు విక్రయించింది. ఆ డబ్బును జల్సాలకు వాడుకుంటోంది. శ్రీవిద్య సెప్టెంబర్‌ ఏడున ఓ ఫంక్షన్‌కు వెళ్లేందుకు తనఆభరణాల కోసం వెతికేసరికి కనిపించలేదు. చోరీకి గురయ్యాయని భావించి ఎవరికీ చెప్పకుండా ఇన్నాళ్లూ మదన పడింది.
Loading...

ఈ నెల 10న సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి, సవితాదేవిపై అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులు సవితాదేవిని అదుపులోకి తీసుకుని విచారించగా, విషయం వెలుగులోకి వచ్చింది. ఆమెతో పాటు నర్సింహను అరెస్టు చేసి, మిగిలిన సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌ ఏసీపీ పృథ్వీధర్‌ రావు, సరూర్‌నగర్‌ ఎస్‌హెచ్‌ఓ రంగస్వామి, డీఐ అర్జునయ్య, డీఎ్‌సఐ వెంకటకృష్ణ పాల్గొన్నారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)