ఎన్నాళ్ళకు మంచి చట్టం తెచ్చారు ? వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారికి జైలు శిక్ష


Loading...

వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారికి శిక్షను రెట్టింపు చేసింది కేంద్రం. ప్రస్తుతమున్న మూడు నెలల జైలు శిక్షను ఆరునెలలకు పెంచేలా చర్యలు చేపట్టింది కేంద్రం ప్రభుత్వం. సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ ఇందుకోసం వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ డ్రాఫ్ట్ బిల్లు 2018 ని సిద్దం చేసింది.
Loading...

గతంలో ఉన్న చట్టానికి ఈ సవరణ చేర్చడంతో 60 ఏళ్లు, అంతకుపైబడిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన వారికి కఠిన శిక్షలు విధిస్తారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకే ఈ సవరణ ఉద్దేశం. ఈ బిల్లు పాస్ అయితే దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒకటి చొప్పున సీనియర్ సిటిజన్ కేర్ హోమ్ ను ఏర్పాటుచేసి, దాన్ని నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)