అత్యాచారం చేస్తూ వ‌చ్చాడు.. ఘ‌న‌కార్యాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి మర్చిపోయి వాట్సాప్ చేసాడు


Loading...

త‌న వ‌ద్ద ట్యూష‌న్ చెప్పించుకోవ‌డానికి వ‌స్తోన్న ఏడేళ్ల బాలిక‌పై ఓ టీచ‌ర్ నెల రోజులుగా లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ట్యూష‌న్ కోసం ఆ బాలిక‌ను పిలిపించుకుని అత్యాచారం చేస్తూ వ‌చ్చాడు. త‌న ఘ‌న‌కార్యాన్ని సెల్‌ఫోన్‌లో బంధించాడు. ఆ విష‌యాన్ని మ‌రిచిపోయి.. ఆ వీడియోను పొర‌పాటున వాట్స‌ప్ చేశాడు. దీనితో అత‌ని ఘాతుకం బ‌హిర్గ‌త‌మైంది. ఈ ఘ‌ట‌న ఒడిశాలోని కేంద్ర‌పారా జిల్లాలో చోటు చేసుకుంది. నిందితుడిని గ‌ణేష్ నాయ‌క్‌గా గుర్తించారు.
Loading...

జిల్లాలోని అంబాపాడ గ్రామానికి చెందిన అత‌ను ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచ‌ర్‌. త‌న వ‌ద్ద ట్యూష‌న్‌కు వ‌చ్చే ఏడేళ్ల బాలిక‌పై క‌న్నేశాడు. ఆమెను బెదిరించి, లొంగ‌దీసుకున్నాడు. అత్యాచారం చేశాడు. దాన్ని వీడియో తీశాడు. ఆ వీడియోను చూపి, బ్లాక్ మెయిల్ చేయ‌సాగాడు. శుక్ర‌వారం సాయంత్రం అత‌ను త‌న స్నేహితుడికి పొర‌పాటున ఈ అత్యాచార వీడియోను వాట్స‌ప్ ద్వారా పంపించాడు. అత‌ని కిరాత‌కాన్ని చూసిన గ‌ణేష్ నాయ‌క్ స్నేహితుడు వెంట‌నే ఈ విష‌యాన్ని ఆ బాలిక త‌ల్లిదండ్రుల‌కు తెలియజేశాడు. ఈ విష‌యంపై త‌ల్లిదండ్రులు త‌మ కుమార్తెను ప్ర‌శ్నించ‌గా..
Loading...

నిజ‌మేన‌ని అంగీక‌రించింది. దీనితో వారు నికిర‌యి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వాట్స‌ప్ వీడియోను సాక్ష్యంగా చూపారు. దీన్ని ఆధారంగా పోలీసులు గ‌ణేష్ నాయ‌క్‌ను అరెస్టు చేశారు. అత‌నిపై పోస్కో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)