ఛి ఛి ఇది పూరీ కాదు.. ఉప్పు లేని ఉప్మా, పులిహోర, దద్దోజనం.. హీరోయిన్ మరీ మైనస్.. నిజం చెప్పు పూరీ, ఆమె ఎక్కడ దొరికింది నీకు ?


Loading...

సాయిరాం శంకర్…. తను పూరీ జగన్నాథ్ బద్రర్… ఆ డ్రగ్స్ డైెరెక్టర్ తన తమ్ముడికి మంచి బ్రేక్, టర్న్, లైఫ్ ఇద్దామని విశ్వప్రయత్నం చేసి, విఫలమై, విసిగిపోయి, ఇక విరక్తితో వదిలేశాడు… వేరే హీరోలతో గతంలో బ్లాక్ బ్లస్టర్లు ఇచ్చిన దర్శకుడే… ఏ థాయ్‌లాండ్‌లోనో మసాజ్ చేయించుకుంటూ కథ రాసుకుంటే ఇక సూపర్ అని తనే చెప్పుకొనేవాడు… అరె బాబూ… ఆ రోజులు పోయాయిరా నాయనా… మరీ నిన్నటి పూరీలు తినే ఓపిక లేదిప్పుడు ఎవరికీ… తమ్ముడి కథ తెల్లారింది, ఇక అలాంటిది ఇంకా మొహంలో బాల్యం ఛాయలు కూడా కనుమరుగు కాని ఆకాష్‌ను ఓ హీరోగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే ఏం చేయాలి..? జనాన్ని విస్మరైజ్ చేసే, అదేలెండి మెస్మరైజ్ చేసే ఓ కొత్త కథను, తొక్కలో సగటు తెలుగు సినిమా హీరో అవలక్షణాలు ఏమీ లేని ఓ పాత్రలో పరిచయం చేయాలి… ఎవడీ హీరో అనిపించేలా లాంచ్ చేయాలి… (అప్పట్లో ఆంధ్రాపోరీ అనే ఏదో సినిమాలో హీరోగా కనిపించాడట… అంటే, ఇది రీలాంచ్ అన్నమాట…) అబ్బే, ప్చ్, తుస్… పేరుకు ఓ కొత్త జానర్ కానీ ఉత్తదే అంతా సుత్తి, సోది… పూరీ, యు లాస్ట్ యువర్ ప్లేస్ ఇన్ టాలీవుడ్… ఇక జీర్ణం చేసుకో… పూరీ, ఒకప్పటి మంచి.. సారీ, ఒకప్పటి పేరొందిన తెలుగు దర్శకుడు మాత్రమే…
Loading...

హీరోకు హీరోయినూ సూట్ కాలేదు, హీరోయిన్‌కు హీరో సూట్ కాలేదు, ఇద్దరికీ కథ సూట్ కాలేదు, ఆ కథకు ఈ దర్శకుడూ సూట్ కాలేదు, ప్రేక్షకుల తాజా అభిరుచికి సినిమా సూట్ కాలేదు… చిత్రహింస పెట్టావు కదా పూరీ…. తెలుగు ఇండస్ట్రీలో ఏక్‌సేఏక్ దర్శకులొస్తున్నారు… కొత్త పాత్రలు, కొత్త కథనరీతులు, కొత్త ప్రజెంటేషన్‌తో ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులతో ఔరా అనిపించుకుంటున్నారు… కానీ నువ్వేమిటి..? ఔరా, ఇలా మారాడేమిటి అనిపించుకుంటున్నావ్..? పూరీ ఎంతటి అజ్ఞానంలో ఉన్నాడో, అసలు ఇన్నాళ్లూ తను పెద్ద దర్శకుడిగా ఎలా చెలామణీ అయ్యాడో కూడా అర్థం కాదు… ఓ చిన్న ఉదాహరణ చెప్పి, తరువాత మాట్లాడుకుందాం… ‘‘బోర్డర్‌లో లేడీ సైన్యం ఉంటుంది… అదీ పాక్- ఇండియా బోర్డర్‌లో… వాళ్లు భారీ భారీ డైలాగ్స్ చెబుతారు, డ్రామా….’’ దేవుడా… పూరీ నువ్వు సినిమాలు మానేయడంపై ఎందుకు సీరియస్‌గా లుక్కేయవు… చిన్నాచితకా వ్యాపారాలుంటే ఆ ఛార్మి మెయింటెయిన్ చేసిపెడుతుంది…
Loading...

అసలు హీరోయిన్ ఎంపిక దగ్గరే పూరీ బ్లండర్ చేసేశాడు… తన కొడుకును ఈ సినిమాలో హీరోగా చేయడం మరో బ్లండర్… కాస్త ఆ మొహం ముదరనీ పూరీ… అప్పుడే అంత తొందరెందుకు..? మరీ తమ్ముడు సాయి రాంశంకర్‌లాగా భ్రష్టుపట్టించడం దేనికి..? అసలే ఓ సాదాసీదా ప్రజెంటేషన్, ఏ చమక్కులూ లేని సినిమా… అందులో పునర్జన్మ… పైగా రెండు దేశాల నడుమ అనుబంధం, ప్రేమల కుహనా ఎమోషన్స్… మరీ ఇంత బరువైన పాత్రలు ఇప్పుడు ట్రెండ్ కావు పూరీ… ఒకవేళ అంత బరువు పాత్రలు వర్కవుట్ కావాలనుకున్నా నీ కొడుకు అస్సలు సూట్ కాలేదు, నీ కథాకథనం అస్సలు సూట్ కాలేదు… చాలాచోట్ల పాపం పూరీ తన కొడుకును ఎందుకంత అవస్థ పెట్టాడో అర్థం కాదు… తన వయస్సు, తన పరిణతి, తన అనుభవం, తన ప్రతిభ, తన లుక్కు అస్సలు నప్పలేదు… సరికదా హీరోయిన్ మరీ మైనస్… నిజం చెప్పు పూరీ, ఆమె ఎక్కడ దొరికింది నీకు..? పైగా అసలు ప్రిక్లైమాక్సులో సల్మాన్ ఖాన్ జిందాబాద్, షారూక్ ఖాన్ జిందాబాద్ అనే డైలాగులు, నినాదాలు ఎందుకో అస్సలు అర్థం కాదు… ఇప్పటికీ ఈ పూరీని జనం ఇష్టపడటం లేదు… చరిత్ర పుటల్లోకి ఎక్కుతున్న దర్శకుడు పూరీ… ఈ స్థితిలో మరీ ఇంత అల్లాటప్పాగా, సాదాసీదాగా, ఏదో డ్రగ్ మత్తులో రీళ్లు చుట్టేసినట్టుగా… ఏంటీ సినిమా పూరీ..? మళ్లీ మీ అబ్బాయిని రీరీలాంచ్ చేయాలంటే… చాలా చాలా కష్టం బాస్….
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)