రేప్ చేస్తామని బెదిరిస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్


Loading...

అల్లు అర్జున్ తాజా చిత్రం ‘నా పేరు సూర్య’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనతో ప్రదర్శితమవుతోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా తెలుగుతో పాటు మలయాళంలో కూడా విడుదలైంది. కేరళలో అల్లు అర్జున్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ కారణంగానే కేరళలో విడుదల చేశారు. అయితే మలయాళ భాషలో విడుదలైన నా పేరు సూర్య సినిమాను చూసిన అపర్ణ ప్రశాంతి అనే
Loading...

మలయాళ సినీ విమర్శకురాలు తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఆమె రివ్యూ అల్లు అర్జున్ అభిమానులకు కోపం తెప్పించింది. ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సమాచారం ప్రకారం.. రివ్యూ చూసిన అల్లు అర్జున్ అభిమానులు తనకు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించారని, కొందరు రేప్ చేస్తామని కూడా భయపెట్టారని అపర్ణ చెప్పారు. తనకు వస్తున్న బెదిరింపులపై ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు, డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు.

Loading...

Popular Posts

Latest Posts