మగబిడ్డ కోసం తన వద్దకు రావాలంటున్న మామ


Loading...

భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా పిడుగురాళ్లలో పుట్టింటికి చేరింది ఓ ఆడబిడ్డ. కూతురు తప్పు చేస్తే కడుపులో పెట్టుకోవాల్సిన తల్లి తాను సహ జీవనం చేస్తున్న వ్యక్తితో కాపురం చేయాలని వేధిస్తూ వచ్చింది. రెండేళ్ల బాబును సాకుతూ ఏమి చేయాలో పాలుపోని స్థితిలో మూడు నెలలుగా తల్లి పెట్టిన మానసిక హింసలను భరించింది కూతురు. తండ్ర వరసయ్యే వ్యక్తితో కాపురం చేయించాలని చూసిన తల్లి చెర నుంచి తప్పించుకొని మార్చి 31న పిడుగురాళ్ల నుంచి ధైర్యం చేసి బాబుతో సహా గుంటూరులోని స్నేహితురాలి వద్దకు చేరింది. ఆమె సాయంతో ఎస్పీని ఆశ్రయించి రక్షణ కల్పించాలని కోరింది.
Loading...

కారంపూడికి చెందిన మరో వివాహితకు ఇద్దరు ఆడ పిల్లలు జన్మించారు. ఈ సాకును ఆడ్డుగా చూపుతూ మగ పిల్లాడు కోసం తనతో లేకుంటే తన కుమార్తె కొడుకులతో కాపురం చేయాలని కోడలిని నిరంతరం హింసిస్తున్నాడు ఆమె మామ. భర్తకు చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో గత్యంతరం లేని స్థితిలో ధైర్యం చేసిన వివాహిత రూరల్‌ ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఇలాంటి సంఘటనలు సమాజంలో అక్కడక్కడ జరుగుతున్నా కొందరు పరువు పేరుతో మౌనంగా భరిస్తున్నారు.
Loading...

కొందరు సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలు వదులుతున్నారు. వీరి వికృత క్రీడలను ఇప్పటికీ చాలా మంది పంటి బిగువున భరిస్తూ మౌనంగా రోదిస్తున్నారు. ఇద్దరు ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో ఎస్పీ సీహెచ్‌ వెంకటప్పల నాయుడు ఆ కేసులను ప్రత్యేకంగా తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మానవ మృగాలకు తమదైన శైలిలో కౌన్సెలింగ్‌ ఇచ్చి బాధితులకు రక్షణ కల్పించారు.

మానవ సంబంధాలకు ప్రాధాన్యమిస్తూ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి. లేకుంటే మనిషికి, పశువులకు తేడా ఉండదు. నా దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. వారికి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బైండోవర్‌ చేశాం. సీహెచ్‌ వెంకటప్పల నాయుడు,రూరల్‌ ఎస్పీ

ఇలాంటి కేసులు నా దృష్టికి రాలేదు. ఎవరైనా బాధితులు ఉంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. విచారకరమైన సంఘటనలు కావడంతో వాటిని ప్రత్యేక కేసుగా పరిగణించి చర్యలు పెడతాం. మానవ మృగాలను క్షమించేది లేదు. బాధితులకు రక్షణ కల్పిస్తాం.-సీహెచ్‌ విజయారావు, అర్బన్‌ ఎస్పీ

మానవ సంబంధాల విషయంలో విచక్షణ కోల్పోతే ప్రమాదకరం. మన సంప్రదాయాలకు ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆర్థిక, సామాజిక ప్రలోభాలకు గురి చేసి భయపెడితే చర్యలు తప్పవు. – డాక్టర్‌ ఐవీఎల్‌ నరసింహారావు

మానవ సంబంధాలకు విలువ ఇవ్వని వారిని కఠినంగా శిక్షించాలి. మృగాలుగా మారిన వారిని సమాజంలో ఉంచడం ప్రమాదకరం. వీరికే జైలే సరి. – ఎన్‌ లక్ష్మి రెడ్డి, న్యాయవాది, గుంటూరు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)