చిన్నారి పెళ్లికొడుకు ! అబ్బాయికి 13 అమ్మాయికి 23 ఏళ్లు ఈ వింత వివాహానికి వచ్చినవారంతా ఆశ్చర్యపోయారు


Loading...

నిరాక్షరాస్యత, అవగాహన రాహిత్యంతో బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. కర్నూలు జిల్లా కర్ణాటక సరిహద్దు మండలాల్లో ఈ జాడ్యం కొనసాగుతోంది. పెద్దలు తీసుకుంటున్న ఈ అనాలోచిత నిర్ణయాలు పిల్లల జీవితాలను చిదిమేస్తున్నాయి. వారం క్రితం ఈ ప్రాంతంలో 13 ఏళ్ల బాలుడికి దాదాపు 23 ఏళ్ల యువతితో జరిగిన పెళ్లి ఈ దురాచారానికి పరాకాష్ఠ అనవచ్చు. తండ్రి మద్యానికి బానిస, తల్లికి తీవ్ర అనారోగ్యం. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. తాను మరణిస్తే పిల్లలు ఏమవుతారనే ఆలోచనతో తల్లి పెద్ద కొడుక్కి పెళ్లిచేయాలని నిర్ణయించింది.
Loading...

దూరపు బంధువుల్లో ఒకమ్మాయిని చూసి ఏప్రిల్‌ 27న పెళ్లి తంతు ముగించారు. కౌతాళం మండలంలోని ఓ కుగ్రామం ఇందుకు వేదికైంది. ఇక్కడ వరుడి వయస్సు 13, వధువు వయస్సు 23 ఏళ్లు కావడం గమనార్హం. దీంతో వివాహానికి వచ్చినవారంతా ఆశ్చర్యపోయారు. కొందరైతే పెళ్లి పెద్దలను తిట్టిపోశారు. ఈ వింత వివాహం చిత్రాలు సామాజిక వేదికల్లో హల్‌చల్‌ చేయడంతో ఆలస్యంగా విషయం బయటకు వచ్చింది.

Loading...


Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)