మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఆమె చేత తాగించాడు.. అత్యాచారం చేసి ఆపై వీడియోతీసి


Loading...

చెన్నై: మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్స్‌‌ ఓ యువతికి ఇచ్చి అత్యాచారం చేసి ఆపై వీడియోతీసి బెదిరించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా కీల్‌పెన్నాతూరు సమీపం నీలంతంగళ్‌ గ్రామానికి చెందిన తమిళ్‌ సెల్వన్‌ అలియాస్‌ బాలాజీ ఇంజనీరింగ్‌ చదువుతున్న సమయంలో ఓ యువతిని ప్రేమించాడు. ప్రస్తుతం బాలాజీ తిరువణ్ణామలైలోని ప్రైవేటు సంస్థలో ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అతను ప్రేమించిన యువతి ఇంటికి ఎవరూలేని సమయంలో వెళ్లి మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్‌ ఆమె చేత తాగించాడు.
Loading...

కాసేపటికి మైకంలో జారుకున్న ఆ యువతిపై అత్యాచారం చేసి, ఆ చిత్రాలను సెల్‌ఫోన్‌తో తీశాడు. మైకం నుండి తేరుకున్న ఆ యువతి దిగ్ర్భాంతి చెంది బాలాజీతో గొడవకు దిగింది. వెంటనే అతను సెల్‌ఫోన్‌లో తీసిన ఆమె చిత్రాలు చూపి బెదిరించి వెళ్లిపోయాడు. తర్వాత కూడా ఆ ఫోటోలు చూపించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇదిలా ఉండగా ఆ యువతికి వివాహం కుదిరిందనే విషయం తెలుసుకున్న బాలాజీ, అతడి తండ్రి కలిసి ఆమె ఇంటికి వెళ్లి యువతి తల్లిదండ్రులను బెదిరించారు. సెల్‌ ఫోన్‌లోని యువతి చిత్రాలను వాట్సప్‌, ఫేస్‌బుక్‌లో పెట్టి కుటుంబ పరువు తీస్తామని హెచ్చరించడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలాజీని, అతని తండ్రిని అరెస్టు చేశారు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)