ఏకంగా నలుగురితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉన్నాడని నలుగురి ప్రియుళ్ళతో కలిసి భర్తను హతమార్చింది


Loading...

గోవాలో దారుణం జరిగింది. ఓ మహిళ నలుగురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అక్రమ సంబంధం గురించి భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. చిక్కుల్లో పడతానని భావించిన ఆమె అతణ్ని అంతమొందించాలనుకుంది. అనుకున్న ప్రకారం తన నలుగురు ప్రియులకు సమాచారం అందించింది. తన ప్రియుల సాయంతో భర్తను హతమార్చింది. అతని దేహాన్ని మూడు ముక్కలుగా నరికి ఓ సంచిలో మూట కట్టిన ఈ కర్కశ ముఠా మూడు ప్రాంతాల్లో మూడు ముక్కలను పడేశారు.
Loading...

గోవాకు చెందిన కల్పన(30) అనే మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. ఏప్రిల్ 1నే ఈ ఘటన జరిగినప్పటికీ ఎవరూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. అయితే నిందితుల్లో ఒకరి భార్యకు తన భర్త ప్రవర్తనపై అనుమానమొచ్చింది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. కల్పన భర్త బసవరాజు గోవాలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడని తెలిసింది. కర్నాటకకు చెందిన బసవరాజు కొన్నేళ్ల క్రితం గోవాకొచ్చి స్థిరపడినట్లు అక్కడి వారు తెలిపారు. పోలీసులు కల్పనను, ఆమె ప్రియులైన సురేష్ కుమార్(రాజస్థాన్), పంకర్ పవార్(మార్గోవ్), అబ్దుల్ షేక్‌లను(కురుకొరెం) అదుపులోకి తీసుకున్నారు. నాలుగో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.

Loading...

Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)