మంచి చదువు చదివించాడు బాగోగులు చూసుకున్నాడు ప్రేమించాడు ఎంతగానో ఆరాధించాడు కానీ సొంత బావనే బలి తీసుకున్న పాపిష్టిది


Loading...

విజయనగరం: ఫేస్‌బుక్‌లో పరిచయమైన పరిచయం ప్రేమకు దారి తీసిన నేపథ్యంలో, ప్రియుడి కోసం పెళ్లైన పది రోజులకే బావను ప్లాన్ ప్రకారం హతమార్చిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. భర్త శంకర్రావును భార్య సరస్వతి సుఫారీ ఇచ్చి హత్య చేయించింది. ఈ కేసులో ఆరుగురు నిందితులు ఉండగా పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ప్రియుడు శివ పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఈ కేసును ఒక్క రోజులోనే చేధించారు. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి జలాశయం వద్ద నిర్మించిన ఐటీడీఏ పార్కు వద్ద శ్రీకాకుళం జిల్లా కడకెల్ల గ్రామానికి చెందిన కొత్త దంపతులు గౌరీశంకర్‌ రావు, సరస్వతిలపై రెండు రోజుల క్రితం దుండగులు దాడి చేశారు. దంపతులిద్దరూ స్వయానా బావమరదళ్లు. ఏప్రిల్‌ 28న పెళ్లయింది. గౌరీశంకర్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి కర్ణాటక రాష్ట్రం రాయ్‌చూర్‌లో ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ పెళ్లి ఇష్టం లేని సరస్వతి ప్రియుడు శివతో ప్లాన్ చేసి భర్తను హత్య చేయించింది. సరస్వతిని గౌరీశంకరరావే చదివించాడని తెలుస్తోంది. కర్ణాటకలో ఉద్యోగం చేస్తున్న ఆయన పెళ్లయ్యాక భార్య కోరిక మేరకు విశాఖ బదిలీ చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు కూడా. మొదటి నుంచి ఆమెని ఆరాధించేవాడని అంటున్నారు. అయితే భార్య సరస్వతి ఇలా చేస్తుందని అతను కలలోనైనా ఊహించలేదని, ఆమెను నమ్మి బలయ్యాడని అంటున్నారు. ఒక్కడే కొడుకు కావడంతో గౌరీశంకరరావు మృతిని అతడి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. సరస్వతి తాతగారి ఇంట్లో ఉండి పదో తరగతి చదువుకుంది. ఇంటర్, డిగ్రీ చదువులను బొబ్బిలి, పాలకొండలో చదివింది.
Loading...

బ్యాంకు ఉద్యోగం కోసం విశాఖలో శిక్షణ తీసుకుంటోంది. ఆ సమయంలో ఫేస్‌బుక్ ద్వారా శివతో పరిచయం ఏర్పడి, ప్రేమకు దారి తీసింది. రెండేళ్లుగా శివతో ప్రేమాయణం కొనసాగిస్తోంది. అయితే బావ గౌరీ శంకర్‌తో సరస్వతికి పెళ్లి చేయాలని చిన్నప్పటి నుంచి ఇరు కుటుంబాలు అనుకున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్‌లో పెళ్లి నిశ్చయమైంది. ఏప్రిల్ 28న పెళ్లయింది. సరస్వతికి భర్తపై ఇష్టం లేకుంటే సూటిగా చెప్పవలసి ఉండెనని, మంచివాడైన సొంత బావను అన్యాయంగా చంపిందని గ్రామస్తులు చలించిపోయారు. శంకర్రావుకు ఉద్యోగం, ఇల్లు తప్ప మరో ధ్యాస లేదని చెబుతున్నారు. కనీసం భర్తపై పెళ్లికి ముందు అయిష్టత ప్రదర్శించకుండా చంపేసిందని చెబుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడం, అది కోడలు పన్నాగంతో చనిపోవడం తెలిసి తల్లిదండ్రులు రోధిస్తున్నారు. పాముకు పాలుపోసి పెంచినట్లు ఇంటి కోడలుగా భావించి సరస్వతిని చదివించినందుకు అమాయకుడైన శంకర్రావును పొట్టన పెట్టుకుందని కన్నీరుమున్నీరు అవుతున్నారు. పెళ్లికి ముందు నుంచే కోడలు సరస్వతి మంచి చెడ్డలతో పాటు చదువు కోసం సహకరించాడని, చివరకు భర్తనే బలి తీసుకుందని కంటతడి పెట్టారు. సరస్వతి ప్రియుడు శివతో కలిసి భర్తను పన్నాగం పన్నింది. తన స్నేహితుడు ద్వారా పాత నేరస్తులతో కలిసి ఈ నెల 7న హత్య చేశారు. హత్య కోసం తాము తాము ఎక్కడున్నామో హంతకులకు తెలిసేలా జీపీఎస్‌ లొకేషన్లు పంపించి ఆమె నిందితులకు సహకరించింది. హత్య విషయం తెలియగానే ఎస్పీ పార్వతీపురం బయలుదేరారు. అయితే మార్గమధ్యలో అనుమానం వచ్చిన వాహనాల్ని తనిఖీ చేశారు. అదే సమయంలో ఎపి31టీఎఫ్ 3533 అనే ఆటోలో డ్రైవరుతో కలిపి నలుగురు యువకులు వెళ్లడం చూశారు. అనుమానం వచ్చి ఆటోని ఆపి ప్రశ్నిస్తే తాము పెళ్లికి వెళ్లి వస్తున్నట్లుగా నమ్మబలికే ప్రయత్నం చేశారు. అయితే వారి ఫోన్లను తీసుకుని చూస్తే నలుగురివి స్విచ్‌ఆఫ్‌ చేసి ఉన్నాయి. అక్కడే ఎస్పీ పాలరాజుకి అనుమానం బలపడింది. వారిని అదుపులోకి తీసుకుని సాంకేతికంగా ఆయా ఫోన్ల సమాచారాన్ని వెలికి తీసే పనిని మొదలు పెట్టారు.
Loading...

దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఆయన పార్వతీపురం చేరుకుని హత్యా ప్రాంతాన్ని పరిశీలించి మృతుడి భార్య సరస్వతితో మాట్లాడారు. ఆమె చెప్పే మాటలు పొంతన లేకుండా ఉండడంతో ఆమె ఫోన్‌ని పరిశీలించి చూస్తే హత్య జరిగాక వాట్సాప్‌ని అన్‌ఇన్‌స్టాల్‌ చేసినట్లుగా తేలింది. మరోవైపు నిందితులు నలుగురిని లోతుగా ప్రశ్నించేసరికి మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకే అసలు వాస్తవాలు ఒప్పుకొన్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో హత్యకు సరస్వతి పన్నిన ప్రతీ పథకం పోలీసులకే దిమ్మదిరిగేలా చేసింది. విచారణలో నిందితులకు ఎప్పటికప్పుడు మెసేజ్‌లు, జీపీఎస్‌ లోకేషన్లు సైతం పంపించినట్లుగా తేలింది. పైగా బంగారం ఎత్తుకుపోయారని చెప్పినా బంగారం ఆమె లో దుస్తుల్లోనే దాచింది. దీంతో సరస్వతితో సహా ఏ1 మెరుగు గోపి, ఏ2 సారిపల్లి రామకృష్ణ, ఏ3 గుర్రాల బంగార్రాజు, ఏ4 దేవరాపల్లి కిషోర్‌లను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో తన చేతికి మట్టి అంటకుండా కథ నడిపించిన సరస్వతి ప్రియుడు శివ పరారీలో ఉన్నాడు. నిందితులు ఆరుగురు 26 ఏళ్ల లోపు వయసువారే. ఈ నేరంపై మంత్రి సుజయ కృష్ణ రంగా రావు మంగళవారం స్పందించారు. నేరం చేయాలనుకునే వారి వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. సొంత మనుషులో ఇలాంటి ఘోరాలకు పాల్పడటం బాధాకరమన్నారు. ఇది సహించలేనిది అన్నారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా పోలీసులు ఈ కేసును కాస్త అటూ ఇటుగా మూడు నాలుగు గంటల్లో చేధించారు.
Loading...

Latest Hits(ఎక్కువ మంది చదివిన వార్తలు)